Kottagaa rekkalochchenaa

కొత్తగా రెక్కలొచ్చెనా
Year
Language

పల్లవి:

కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

చరణం 1:

కొండ దారి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు (2)
బండరాల హోరు మారి పంట చేల పాటలూరి (2)
మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరి చిందులేసింది కనువిందు చేసింది
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

చరణం 2:

వెదురులోకి ఒదిగిందీ కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగిందీ మధురగానకేళి (2)
బాషలోన రాయలేని రాసలీల రేయిలోని (2)
యమున తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

pallavi:

kŏttagā rĕkkalŏchchĕnā gūḍiloni guvva pillagi
mĕttagā regu vichchĕnā mĕttagā regu vichchĕnā
kŏmma sāḍununna kannĕ malligi kŏmma sāḍununna kannĕ malligi
kŏttagā rĕkkalŏchchĕnā mĕttagā regu vichchĕnā

saraṇaṁ 1:

kŏṁḍa dāri mārsiṁdi kŏṁṭĕ vāgu joru
kulugulĕnno nersiṁdi kaligi eḍi nīru (2)
baṁḍarāla horu māri paṁṭa sela pāḍalūri (2)
meghāla rāgāla māgāṇi ūgela siri siṁdulesiṁdi kanuviṁdu sesiṁdi
kŏttagā rĕkkalŏchchĕnā mĕttagā regu vichchĕnā

saraṇaṁ 2:

vĕdurulogi ŏdigiṁdī kuduruleni gāli
ĕdurulega ĕdigiṁdī madhuragānageḽi (2)
bāṣhalona rāyaleni rāsalīla reyiloni (2)
yamuna taraṁgāla kamanīya śhṛṁgāra kaḽalĕnno sūbiṁdi kalalĕnno rebiṁdi
kŏttagā rĕkkalŏchchĕnā gūḍiloni guvva pillagi
mĕttagā regu vichchĕnā mĕttagā regu vichchĕnā
kŏmma sāḍununna kannĕ malligi kŏmma sāḍununna kannĕ malligi
kŏttagā rĕkkalŏchchĕnā mĕttagā regu vichchĕnā