Komtegaanni kattugo

కొంటెగాణ్ణి కట్టుకో
Year
Language

పల్లవి:

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో
కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలుకళ్ళ పిల్లదానా

తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు ||2||

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో
కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలుకళ్ళ పిల్లదానా

చరణం 1:

అందరిని దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే ||2||

చిన్నారి మైనా చిన్నదానా
నే గాలం వేశానంటే పడితీరాలెవరైనా
బంగారమంటి సింగారం నీదే
అందం సొంతమైతే లేనిదేది లేదే || కొంటెగాణ్ణి కట్టుకో ||

చరణం 2:

ఆఁ... కొనచూపుతోనే వేశావు బాణం
రేపావు నాలో నిలువెల్ల దాహం
కొరగాని వాడితో మనువు మహఘోరం
ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం
చిగురాకు పరువం సెగ రేగే అందం
నీకు కానుకంట ప్రతిరోజు పండగంట || కొంటెగాణ్ణి కట్టుకో ||

pallavi:

kŏṁṭĕgāṇṇi kaṭṭugo kŏṁgugesi suṭṭugo
koḍi vannĕlunnadānā
aṁdamaṁtā ichchugo aṁdinaṁta puchchugo
vālugaḽḽa pilladānā

tīrāli achchaṭlu sāgāli muchchaṭlu
siggullo jāribovāli sīgaṭlu ||2||

kŏṁṭĕgāṇṇi kaṭṭugo kŏṁgugesi suṭṭugo
koḍi vannĕlunnadānā
aṁdamaṁtā ichchugo aṁdinaṁta puchchugo
vālugaḽḽa pilladānā

saraṇaṁ 1:

aṁdarini dose dŏṁga nenele
nā guṁḍĕ dosugunna dŏrasāni nīvele ||2||

sinnāri mainā sinnadānā
ne gālaṁ veśhānaṁṭe paḍidīrālĕvarainā
baṁgāramaṁṭi siṁgāraṁ nīde
aṁdaṁ sŏṁtamaide lenidedi lede || kŏṁṭĕgāṇṇi kaṭṭugo ||

saraṇaṁ 2:

ām̐... kŏnasūbudone veśhāvu bāṇaṁ
rebāvu nālo niluvĕlla dāhaṁ
kŏragāni vāḍido manuvu mahaghoraṁ
ī mŏnagāḍe nāvāḍaide badugu baṁgāraṁ
sigurāgu paruvaṁ sĕga rege aṁdaṁ
nīgu kānugaṁṭa pradiroju paṁḍagaṁṭa || kŏṁṭĕgāṇṇi kaṭṭugo ||