Komdagona paalainaa

కొండకోన పాలైనా
Year
Language

పల్లవి:

కొండకోన పాలైన సీతమ్మ మదిలోన ...కోపమేల రాలేదు రామయ్యపైనా
కొండకోన పాలైన సీతమ్మ మదిలోన ..కోపమేల రాలేదు రామయ్యపైనా

సీత సర్వమూ రామపాదమూ...రామచంద్రుడే సీత ప్రాణమూ
ఆ రామయ్య సీతమ్మ అనురాగబంధం ఎంత మధురమూ...

కొండకోన పాలైన సీతమ్మ మదిలోన ...కోపమేల రాలేదు రామయ్యపైనా

చరణం 1:

నీలాగా ద్రౌపదుంటే ధర్మరాజు జూదరిగా పేరొందునా...
భారతాన యుద్ధమునకు తావుండునా..

లోపమంటూ లేనివాడూ లోకమందు ఉండబోడు ఏ ఒక్కడూ...
తప్పు దిద్దుకున్నవాడే ఆ దేవుడూ...

నీ సహనానికీ నా భాష్పాంజలీ...నీ హృదయానికీ ఇది పుష్పాంజలీ
ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోము పండెనూ

కొండకోన పాలైన సీతమ్మ మదిలోన ...కోపమేల రాలేదు రామయ్యపైనా
రాయల్లె ఉన్నా... ఈ రామయ్య పైనా

చరణం 2:

కన్ను కాచే రెప్ప నీవే...ఆకలైన వేళ అమ్మ లాలింపువే
కన్ను చెమ్మగిల్లు వేళ చెల్లెమ్మవే...

కంటి చెమ్మా చూడలేనీ ...తోడు నీడ వీడలేని ఇల్లాలినీ
జన్మజన్మలందు నేను నీదానినీ..

ఈ జగమంతటా నిను తిలకించనీ...నీ సగభాగమై నను తరియించనీ
నా బంగారు కలలన్ని ఫలించి ఇల్లే స్వర్గమైనదీ

కొండకోన పాలైన సీతమ్మ మదిలోన ...కోపమేల రాలేదు రామయ్యపైనా
కొండకోన పాలైన సీతమ్మ మదిలోన ...కోపమేల రాలేదు రామయ్యపైనా
సీత సర్వమూ రామపాదమూ...రామచంద్రుడే సీత ప్రాణమూ
ఆ రామయ్య సీతమ్మ అనురాగబంధం ఎంత మధురమూ

కొండకోన పాలైన సీతమ్మ మదిలోన ..కోపమేల రాలేదు రామయ్యపైనా
రాయల్లె ఉన్నా... ఈ రామయ్య పైనా

pallavi:

kŏṁḍagona pālaina sīdamma madilona ...kobamela rāledu rāmayyabainā
kŏṁḍagona pālaina sīdamma madilona ..kobamela rāledu rāmayyabainā

sīda sarvamū rāmabādamū...rāmasaṁdruḍe sīda prāṇamū
ā rāmayya sīdamma anurāgabaṁdhaṁ ĕṁta madhuramū...

kŏṁḍagona pālaina sīdamma madilona ...kobamela rāledu rāmayyabainā

saraṇaṁ 1:

nīlāgā draubaduṁṭe dharmarāju jūdarigā perŏṁdunā...
bhāradāna yuddhamunagu tāvuṁḍunā..

lobamaṁṭū lenivāḍū logamaṁdu uṁḍaboḍu e ŏkkaḍū...
tappu diddugunnavāḍe ā devuḍū...

nī sahanānigī nā bhāṣhpāṁjalī...nī hṛdayānigī idi puṣhpāṁjalī
e devuḽḽu digivachchi dīviṁchināro nomu paṁḍĕnū

kŏṁḍagona pālaina sīdamma madilona ...kobamela rāledu rāmayyabainā
rāyallĕ unnā... ī rāmayya painā

saraṇaṁ 2:

kannu kāse rĕppa nīve...āgalaina veḽa amma lāliṁpuve
kannu sĕmmagillu veḽa sĕllĕmmave...

kaṁṭi sĕmmā sūḍalenī ...toḍu nīḍa vīḍaleni illālinī
janmajanmalaṁdu nenu nīdāninī..

ī jagamaṁtaḍā ninu tilagiṁchanī...nī sagabhāgamai nanu tariyiṁchanī
nā baṁgāru kalalanni phaliṁchi ille svargamainadī

kŏṁḍagona pālaina sīdamma madilona ...kobamela rāledu rāmayyabainā
kŏṁḍagona pālaina sīdamma madilona ...kobamela rāledu rāmayyabainā
sīda sarvamū rāmabādamū...rāmasaṁdruḍe sīda prāṇamū
ā rāmayya sīdamma anurāgabaṁdhaṁ ĕṁta madhuramū

kŏṁḍagona pālaina sīdamma madilona ..kobamela rāledu rāmayyabainā
rāyallĕ unnā... ī rāmayya painā