Kogilammaa badaayi saalimchu

కోకిలమ్మా బడాయి చాలించు
Work
Year
Language

పల్లవి:

కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా
చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కిలోన వర్షించు పూలవాన
ఆశ లతలోన జనించు తేనె సోన వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మా

కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా

చరణం 1:

ఒకే పదం ఒకే విధం కుహు కుహు
అదే వ్రతం అదే మతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది
అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది
చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మా
శ్రమించి కొత్తపాట దిద్దుకోమ్మ ఖరీదు కాదులేమ్మ

చరణం 2:

మావిళ్లలో నీ గూటిలో ఎన్నాళ్లిలా ..హా హా
మా ఊరిలో కచ్చేరిలో పాడాలిగా.. హా హా
చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా
తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మ
దమ్ములుంటే నాపైన నెగ్గవమ్మ అదంత
తేలికేమి కాదులేమ్మా ఎత్తాలి కొత్త జన్మ

pallavi:

kogilammā baḍāyi sāliṁchu mā suśhīla jānagammā svarālu nīlo levammā
kogilammā baḍāyi sāliṁchu mā suśhīla jānagammā svarālu nīlo levammā
salāgi sitralona sumiṁchu saitra vīṇa vinīla jikkilona varṣhiṁchu pūlavāna
āśha ladalona janiṁchu tenĕ sona vinesi tariṁchi talŏṁchugĕḽlavammā

kogilammā baḍāyi sāliṁchu mā suśhīla jānagammā svarālu nīlo levammā
kogilammā baḍāyi sāliṁchu mā suśhīla jānagammā svarālu nīlo levammā

saraṇaṁ 1:

ŏge padaṁ ŏge vidhaṁ kuhu kuhu
ade vradaṁ ade madaṁ anukṣhaṇaṁ
navīna rāgamuṁdi pravāha vegamuṁdi
anaṁta gīdamuṁdi asādhya rīdi uṁdi
seravamma saritra mārsugommā
śhramiṁchi kŏttabāḍa diddugomma kharīdu kādulemma

saraṇaṁ 2:

māviḽlalo nī gūḍilo ĕnnāḽlilā ..hā hā
mā ūrilo kachcherilo pāḍāligā.. hā hā
sinnāri silaga paina savālu seyagammā
tūnīga tenĕḍīga sappaṭlu sālavamma
dammuluṁṭe nābaina nĕggavamma adaṁta
teligemi kādulemmā ĕttāli kŏtta janma