Ko amte koyilamma kogo

కో అంటే కోయిలమ్మ కోకో
Year
Language

పల్లవి:

కో అంటే కోయిలమ్మ కోకో .. కో అంటె కోడిపుంజు కొక్కరకో
కో అంటే కోయిలమ్మ కోకో ..కో అంటె కోడిపుంజు కొక్కరకో

కొండ మీద కో అంటే ..చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే ..పండింది కోసుకో ...కోసుకో.. కో....కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకో .. కో అంటె కోడిపుంజు కొక్కరకో

చరణం 1:

కోటేరు పట్టినోడుకో.... పూటకొడు దక్కదెందుకో
నారు నీరు పోసినోడికో...సేరు గింజలుండవెందుకో
అన్నం ఉండదు ఒకడికి...తిన్నది అరగదు ఒకడికి ..ఆశచావదొకడికి...ఆకలాడదొకడికి!

కోసుకో.. కో....కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకో .. కో అంటె కోడిపుంజు కొక్కరకో

చరణం 2:

మేడిపండు మేలిమెందుకో...పొట్ట ఇప్పి గుట్టు తెలుసుకో
చీమలల్లే కూడబెట్టుకో...పాములొస్తే కర్రపట్టుకో...కో..
కో.. అంటే మేలుకో....
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
ఏవైన వేదాలు చెపుతా రాసుకో.. రాసుకో... కో...కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకోకో అంటె కోడిపుంజు కొక్కరకో

చరణం 3:

తుర్పు ఇంటి ఆంకాళమ్మ కో... కో ... పడమటింటి పోలేరమ్మ కొకో..కొక్కో
దక్షిణాన గంగానమ్మ కో.. కో .. ఉత్తరాన నూకాలమ్మ కొక్కరకో
కో.. అంటే కోటిమంది అమ్మతల్లులున్నా పంట చేను కాపలాకు నేను ఎందుకో .. కో... కాసుకో !

కో అంటే కోయిలమ్మ కోకో ..కో అంటె కోడిపుంజు కొక్కరకో

కొండ మీద కో అంటే ..చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే ..పండింది కోసుకో ...కోసుకో.. కో....కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకో .. కో అంటె కోడిపుంజు కొక్కరకో

pallavi:

ko aṁṭe koyilamma kogo .. ko aṁṭĕ koḍibuṁju kŏkkarago
ko aṁṭe koyilamma kogo ..ko aṁṭĕ koḍibuṁju kŏkkarago

kŏṁḍa mīda ko aṁṭe ..sukkalanni kosugo
nela mīda ko aṁṭe ..paṁḍiṁdi kosugo ...kosugo.. ko....kāsugo
ko aṁṭe koyilamma kogo .. ko aṁṭĕ koḍibuṁju kŏkkarago

saraṇaṁ 1:

koḍeru paṭṭinoḍugo.... pūḍagŏḍu dakkadĕṁdugo
nāru nīru posinoḍigo...seru giṁjaluṁḍavĕṁdugo
annaṁ uṁḍadu ŏgaḍigi...tinnadi aragadu ŏgaḍigi ..āśhasāvadŏgaḍigi...āgalāḍadŏgaḍigi!

kosugo.. ko....kāsugo
ko aṁṭe koyilamma kogo .. ko aṁṭĕ koḍibuṁju kŏkkarago

saraṇaṁ 2:

meḍibaṁḍu melimĕṁdugo...pŏṭṭa ippi guṭṭu tĕlusugo
sīmalalle kūḍabĕṭṭugo...pāmulŏste karrabaṭṭugo...ko..
ko.. aṁṭe melugo....
ko.. aṁṭe melugo logānni tĕlusugo
evaina vedālu sĕbudā rāsugo.. rāsugo... ko...kāsugo
ko aṁṭe koyilamma kogoko aṁṭĕ koḍibuṁju kŏkkarago

saraṇaṁ 3:

turbu iṁṭi āṁkāḽamma ko... ko ... paḍamaḍiṁṭi poleramma kŏgo..kŏkko
dakṣhiṇāna gaṁgānamma ko.. ko .. uttarāna nūgālamma kŏkkarago
ko.. aṁṭe koḍimaṁdi ammadallulunnā paṁṭa senu kābalāgu nenu ĕṁdugo .. ko... kāsugo !