Kiraadaarjuneeyam

కిరాతార్జునీయం
Year
Language

పల్లవి:

తకితథక తకతకిత జకిత పదయుగళ
నికట గంగాస్తవిత మకుట తట నిగళా
హరిహరాంచిత కళా కలిత నీలగళా
సాంద్రఛ్చటాపటల నిటళ చంద్రకళా

జయజయ మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ ఆభయంకరా

అని దేవతలు శివుని కొనియాడ
పరవశమున శివుడు తాండవమాడగా
కంపించెనింతలో కైలాసమావేళ
కనిపించెనంత అకాల ప్రళయ జ్వాలా
జగములేలిన వాని సగము నివ్వెరబోయే
సగము మిగిలిన వాని మొగము నగవైపోయే

చరణం 1:

ఓం నమః శివాయా
ఓం నమః శివాయా

అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు (2)

అనితరాసాధ్యము పాశుపతాస్త్రం
కోరి ఇంద్ర గిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహత్తు

నెలవంక తలపాగ నెమలి ఈకగ మారే
తలపైని గంగమ్మ తలపులోనికి జారే
నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే
భూతిపూతకుమారు పులితోలు వలువాయే
ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా
తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా
ఓంకార ధనవుగా ఒదిగే త్రిశూలంబు
కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు
కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు

చరణం 2:

శివుని ఆనతిని శిరమున దాల్చి
మూకాశురుడను రాక్షసుడు
వరాహ రూపము ధరించి వచ్చెను
ధరతలంబే అధిరిపోవగా
చిచ్చరపిడుగై వచ్చిన పందిని
రెచ్చిన కోపముతో అర్జునుడు
మట్టుబెట్టగా పట్టెబాణము
ధనువొక చేతను అందుకొని
చూసిన కంటను చూడకనే
గురి చూసినంతనే ....
వేచినంతనే ...తలలు రెండుగా
బిల బిలలాడుతూ తనువు కొండగా
గిర గిరతిరుగుతూ అటు ఇటు తగిలిన
రెండు బాణముల అసువులు వీడెను వరాహము

' కొట్టితి నేననీ అర్జునుడు '
పడకొట్టితినేననీ శివుడు
పట్టిన పట్టును వదలకనే
తొడకొట్టిన వీరముతో అపుడు

' వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది
వేటి తగవు పొమ్మని విను మీటి పలికె ' శివుడు
' చేవ నాది చేతనాది చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కనుసైగ చేసె ' అర్జునుడు

గాంఢీవ పాండిత్య కళలుగా బాణాలు
కురిపించే అర్జునుడు కానీ
అపుడతను వేయి చేతుల కార్తవీర్యార్జునుడు
ఓంకార ఘన ధనుష్టంకారములతోడ
శరపరంపర కురిసే హరుడు
అయినా నరునికాతడు మనోహరుడు

చరణం 3:

చిత్రమేమో గురిపెట్టిన బాణములు మాయమాయే
విధివిలాశమేమో పెట్టిన గురి వట్టిదాయే
అస్త్రములే విఫలమాయే
శస్త్రములే వికలమాయే
సవ్యసాచి కుడియడమై సంధించుట మరచిపోయే....

జగతికి సుగతిని సాధించిన తల
దిగంతాల కవతల వెలిగే తల
గంగకు నెలవై కళకాధరువై
హరి బ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై అకలవితమై
శ్రీకరమై శుభమైన శివుని తల
అదరగా సుదతి చెదరగా

కాడి ఎద్దు గాంఢీవముతో ముక్కాడి ఎద్దు గా
ఎదిగి అర్జునుడు చెండ కోపమున కొట్టినంతనే.....

తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు
కోరినవరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తి తో అపుడు

"కరచరణ కృతంవా
కర్మ వాక్కాయజంవా
శ్రవణ నయనజంవా
మానసంవాపరాధం
విహితమహితంవా
సర్వామే తక్షమస్వ
శివ శివ కరుణాబ్దే
శ్రీమహాదేవ శంభో
నమస్తే నమస్తే నమస్తే నమః"

pallavi:

tagidathaga tagadagida jagida padayugaḽa
nigaḍa gaṁgāstavida maguḍa taḍa nigaḽā
hariharāṁchida kaḽā kalida nīlagaḽā
sāṁdrachhchaḍābaḍala niḍaḽa saṁdragaḽā

jayajaya mahādeva śhivaśhaṁkarā
harahara mahādeva ābhayaṁkarā

ani devadalu śhivuni kŏniyāḍa
paravaśhamuna śhivuḍu tāṁḍavamāḍagā
kaṁpiṁchĕniṁtalo kailāsamāveḽa
kanibiṁchĕnaṁta agāla praḽaya jvālā
jagamulelina vāni sagamu nivvĕraboye
sagamu migilina vāni mŏgamu nagavaiboye

saraṇaṁ 1:

oṁ namaḥ śhivāyā
oṁ namaḥ śhivāyā

adaḍe adaḍe arjunuḍu
pāṁḍava vīra yaśhodhanuḍu (2)

anidarāsādhyamu pāśhubadāstraṁ
kori iṁdra giri seri śhivunigai
ahorātramulu sesĕnu tabassu
idi sṛṣhṭiṁchĕnu divya mahattu

nĕlavaṁka talabāga nĕmali īgaga māre
talabaini gaṁgamma talabulonigi jāre
nippulumise kannu niduroyi bŏṭṭāye
bhūdibūdagumāru pulidolu valuvāye
ĕruga kaligina śhivuḍu ĕrugagā māragā
talli pārvadi māre tānu ĕrugadagā
oṁkāra dhanavugā ŏdige triśhūlaṁbu
kailāsamunu vīḍi kadali vachchĕnu śhivuḍu
kailāsamunu vīḍi kadali vachchĕnu śhivuḍu

saraṇaṁ 2:

śhivuni ānadini śhiramuna dālsi
mūgāśhuruḍanu rākṣhasuḍu
varāha rūbamu dhariṁchi vachchĕnu
dharadalaṁbe adhiribovagā
sichcharabiḍugai vachchina paṁdini
rĕchchina kobamudo arjunuḍu
maṭṭubĕṭṭagā paṭṭĕbāṇamu
dhanuvŏga sedanu aṁdugŏni
sūsina kaṁṭanu sūḍagane
guri sūsinaṁtane ....
vesinaṁtane ...talalu rĕṁḍugā
bila bilalāḍudū tanuvu kŏṁḍagā
gira giradirugudū aḍu iḍu tagilina
rĕṁḍu bāṇamula asuvulu vīḍĕnu varāhamu

' kŏṭṭidi nenanī arjunuḍu '
paḍagŏṭṭidinenanī śhivuḍu
paṭṭina paṭṭunu vadalagane
tŏḍagŏṭṭina vīramudo abuḍu

' veḍa nādi veḍu nādi veḍāḍe soḍu nādi
veḍi tagavu pŏmmani vinu mīḍi paligĕ ' śhivuḍu
' seva nādi sedanādi seḍĕrugani īḍĕ nādi
sevuṁṭe rammani kanusaiga sesĕ ' arjunuḍu

gāṁḍhīva pāṁḍitya kaḽalugā bāṇālu
kuribiṁche arjunuḍu kānī
abuḍadanu veyi sedula kārdavīryārjunuḍu
oṁkāra ghana dhanuṣhṭaṁkāramuladoḍa
śharabaraṁpara kurise haruḍu
ayinā narunigādaḍu manoharuḍu

saraṇaṁ 3:

sitramemo guribĕṭṭina bāṇamulu māyamāye
vidhivilāśhamemo pĕṭṭina guri vaṭṭidāye
astramule viphalamāye
śhastramule vigalamāye
savyasāsi kuḍiyaḍamai saṁdhiṁchuḍa marasiboye....

jagadigi sugadini sādhiṁchina tala
digaṁtāla kavadala vĕlige tala
gaṁgagu nĕlavai kaḽagādharuvai
hari brahmalagu taragani paruvai
adi pavitramai agalavidamai
śhrīgaramai śhubhamaina śhivuni tala
adaragā sudadi sĕdaragā

kāḍi ĕddu gāṁḍhīvamudo mukkāḍi ĕddu gā
ĕdigi arjunuḍu sĕṁḍa kobamuna kŏṭṭinaṁtane.....

tallidaṁḍrula saluva tanuvaina devuḍu
korinavarālichchu kŏṁḍaṁta devuḍu
ĕduḍa nilisĕnu śhivuḍu ĕdaloni devuḍu
padamulaṁṭĕnu naruḍu bhakti to abuḍu

"karasaraṇa kṛtaṁvā
karma vākkāyajaṁvā
śhravaṇa nayanajaṁvā
mānasaṁvābarādhaṁ
vihidamahidaṁvā
sarvāme takṣhamasva
śhiva śhiva karuṇābde
śhrīmahādeva śhaṁbho
namaste namaste namaste namaḥ"