Kila kila mani kalaavaru raani

కిల కిల మని కళావరు రాణి
Year
Language

పల్లవి:

కిల కిల మని కళావరు రాణి
ఘల్లు ఘల్లు మని కథాకళి కాని
కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని

ఛల్ మోహనాంగా సుఖాలకు బోణి
చలి గిలి అన్ని పొలోమని పోని
సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని

మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని
మగ జత పాడే బాణి మగువకు రేవై రాణి

కిల కిల మని కళావరు రాణి
ఘల్లు ఘల్లు మని కథాకళి కాని
కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని

చరణం 1:

బరువుగా.. విరివిగా.. ఆపె చూపు కథ ఏపుగా.. గోపిక
చొరవగా.. కరువుగా.. కాపు వేసె కథ కైపుగా.. కోరిక
వాలే పరువాలే తగువేలే గనుకా
కాలే తమకాలే గమకాలే పలుకా

కాంక్షలో శ్రుతీ గతి పెంచీ
కాల్చదా చుట్టు కట్టే కంచే.. ఈ మైకం
ఈడులో అతి గతి లేని
వేడికో దిక్కు మొక్కు పంచి.. ఈ రాగం
ఆదమరిచిన ఈడులో ఈతలాడని

ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి
చలి గిలి అన్ని పొలోమని పోని
సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని

చరణం 2:

ఒడుపుగా.. ఒలుచుకో.. ఓపలేను కదా ఒంటిలో.. అవసరం
చిలిపిగా.. దులుపుకో.. మోయలేవు కదా నడుములో.. కలవరం

తాపం తెరతీసి తరిమేసే తరుణం
తాళం తలుపేసి విరబూసే సమయం
వీలుగా గుట్టు మట్టు మీటి విలుగా ఇట్టె పుట్టే వేడి ఏడెడో
ఒంటిగ ఉంటే ఒట్టే అంటు వెంటనే జట్టే కట్టెయాలి ఏనీడో
జోడు బిగిసిన వేడిలో వేగిపోని

కిల కిల మని కళావరు రాణి
ఘల్లు ఘల్లు మని కథాకళి కాని
కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని

ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి
చలి గిలి అన్ని పొలోమని పోని
సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని

మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని
మగ జత పాడే బాణి మగువకు రేవై రాణి

కిల కిల మని కళావరు రాణి
ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి
కళ్ళెం లేని కళ్ళల్లోని కవ్వింతల్ని హలో అని

pallavi:

kila kila mani kaḽāvaru rāṇi
ghallu ghallu mani kathāgaḽi kāni
kaḽḽĕṁ leni kaḽḽaloni kavviṁtalni halo ani

shal mohanāṁgā sukhālagu boṇi
sali gili anni pŏlomani poni
siggeleni siṁgārāni siṁdiṁchani salo hani

madanuḍi pālaiboni mudirina bhāvālanni
maga jada pāḍe bāṇi maguvagu revai rāṇi

kila kila mani kaḽāvaru rāṇi
ghallu ghallu mani kathāgaḽi kāni
kaḽḽĕṁ leni kaḽḽaloni kavviṁtalni halo ani

saraṇaṁ 1:

baruvugā.. virivigā.. ābĕ sūbu katha ebugā.. gobiga
sŏravagā.. karuvugā.. kābu vesĕ katha kaibugā.. koriga
vāle paruvāle taguvele ganugā
kāle tamagāle gamagāle palugā

kāṁkṣhalo śhrudī gadi pĕṁchī
kālsadā suṭṭu kaṭṭe kaṁche.. ī maigaṁ
īḍulo adi gadi leni
veḍigo dikku mŏkku paṁchi.. ī rāgaṁ
ādamarisina īḍulo īdalāḍani

shal mŏhanāṁgā sukhālagu boṇi
sali gili anni pŏlomani poni
siggeleni siṁgārāni siṁdiṁchani salo hani

saraṇaṁ 2:

ŏḍubugā.. ŏlusugo.. obalenu kadā ŏṁṭilo.. avasaraṁ
silibigā.. dulubugo.. moyalevu kadā naḍumulo.. kalavaraṁ

tābaṁ tĕradīsi tarimese taruṇaṁ
tāḽaṁ talubesi virabūse samayaṁ
vīlugā guṭṭu maṭṭu mīḍi vilugā iṭṭĕ puṭṭe veḍi eḍĕḍo
ŏṁṭiga uṁṭe ŏṭṭe aṁṭu vĕṁṭane jaṭṭe kaṭṭĕyāli enīḍo
joḍu bigisina veḍilo vegiboni

kila kila mani kaḽāvaru rāṇi
ghallu ghallu mani kathāgaḽi kāni
kaḽḽĕṁ leni kaḽḽaloni kavviṁtalni halo ani

shal mŏhanāṁgā sukhālagu boṇi
sali gili anni pŏlomani poni
siggeleni siṁgārāni siṁdiṁchani salo hani

madanuḍi pālaiboni mudirina bhāvālanni
maga jada pāḍe bāṇi maguvagu revai rāṇi

kila kila mani kaḽāvaru rāṇi
shal mŏhanāṁgā sukhālagu boṇi
kaḽḽĕṁ leni kaḽḽalloni kavviṁtalni halo ani