కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే
పల్లవి:
సా...నిసరిసాని...ఆహాహా
సా నిసమగామరి
పదసా..నిసరీసాని...
ఆహాహా
సా..నిసమగామరి
పదసససని రిరిరిస గగగరి
మపమగ పా...
సా ని ద ప మ గ రి స ని..
కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా ఆ ఆ....
చరణం 1:
గరిస పమగ పాని సరిగ రిగస నీదా..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే....
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పువ్వులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా ఆ....
చరణం 2:
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడచుల మనసుల పంజర సుఖముల
పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా ఆ ఆ...
pallavi:
sā...nisarisāni...āhāhā
sā nisamagāmari
padasā..nisarīsāni...
āhāhā
sā..nisamagāmari
padasasasani riririsa gagagari
mabamaga pā...
sā ni da pa ma ga ri sa ni..
kīravāṇi...silagalā kŏligiro pāḍaveme
valabule tĕlubagā
virabūsina āśhalu
viridenĕlu sallaga
alarulu kurisina ṛtuvula taḍisina madhurasavāṇi
kīravāṇi... silagalā kŏligiro pāḍaveme
valabule tĕlubagā ā ā....
saraṇaṁ 1:
garisa pamaga pāni sariga rigasa nīdā..
ī pūlalo aṁdamai ī gālilo gaṁdhamai
nā toḍalo saitramai ī bāḍane naḍasirā
nī gaganālalo ne sirudāranai
nī adharālalo ne sirunavvunai
svarame layagā mugise..
salalida kalaruda svaranuda gadiyuda
gamagamu tĕliyagane....
kīravāṇi silagalā kalagalā pāḍaledu
valabule tĕlubagā
ilarālina puvvulu vĕdajallina tāvula
aligiḍi ĕrugani pilubula
aligina maṁjulavāṇi
kīravāṇi silagalā kalagalā pāḍaledu
valabule tĕlubagā ā....
saraṇaṁ 2:
nī kannulā nīlamai nī navvulā vĕnnĕlai
saṁpĕṁgalā gālinai tārāḍanā nīḍanai
nī kavanālalo ne tŏli prāsanai
nī javanālalo jājula vāsanai
ĕdalo ĕdale kadile
paḍasula manasula paṁjara sukhamula
palugulu tĕliyagane
kīravāṇi silagalā kalagalā pāḍaledu
valabule tĕlubagā
virabūsina āśhalu
viridenĕlu sallaga
alarulu kurisina ṛtuvula taḍisina madhurasavāṇi
kīravāṇi... silagalā kŏligiro pāḍaveme
valabule tĕlubagā ā ā...