Keeravaani raagamlo pilisimdoga hrdayam

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
Year
Language

పల్లవి:

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్తకొత్త ఊహలతో వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంటా
నిన్నుతాకి పొంగిపోవు నీలిమబ్బుని నేనంటా
వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా జతచేరగా రావా

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్తకొత్త ఊహలతో వణికిందొక అధరం

చరణం 1:

మంచు వెన్నెల స్నానమాడిన మల్లెపందిరిలో
వలపు వాకిట వేచి నిలిచిన వయసు పల్లకిలో

ఏకాంతసేవకు ఉర్రూతలూగిన శృంగార శిల్పానివా
కల్యాణ రాముని కౌగిట్లో ఒదిగిన బంగారు పుష్పానివా

పంచుకో ప్రియతమా ప్రేమనీ .. ప్రేమగా తీయగా తియతీయగా ..తమకానివై ప్రేమ !

కీరవాణి రాగంలో... పిలిచిందొక హృదయం
కొత్తకొత్త ఊహలతో... వణికిందొక అధరం..

చరణం 2:

కదనసీమకు కాలుదువ్విన గడుసు మన్మథుడా
కౌగిలింతల కాటువెయ్యకు చిలిపి చందురుడా

వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా
మందార పెదవుల గంధాలు తియ్యక అయ్యారే ఉండేదెలా

అందుకో అధరమే హాయిగా ఏకమై..ఘాటుగా అలవాటుగా.. తెరచాటుగా భామా!

కీరవాణి రాగంలో.. పిలిచిందొక హృదయం
కొత్తకొత్త ఊహలతో...వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు...రాజహంసవు నీవంటా
నిన్నుతాకి పొంగిపోవు... నీలిమబ్బుని నేనంటా
వానలా వచ్చి వరదలా... పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా... జతచేరగా రావా

కీరవాణి రాగంలో... పిలిచిందొక హృదయం
కొత్తకొత్త ఊహలతో... వణికిందొక అధరం..

pallavi:

kīravāṇi rāgaṁlo pilisiṁdŏga hṛdayaṁ
kŏttagŏtta ūhalado vaṇigiṁdŏga adharaṁ
gālilona telibovu rājahaṁsavu nīvaṁṭā
ninnudāgi pŏṁgibovu nīlimabbuni nenaṁṭā
vānalā vachchi varadalā pŏṁgu premave nīvā
mĕrubulā maimarabulā jadaseragā rāvā

kīravāṇi rāgaṁlo pilisiṁdŏga hṛdayaṁ
kŏttagŏtta ūhalado vaṇigiṁdŏga adharaṁ

saraṇaṁ 1:

maṁchu vĕnnĕla snānamāḍina mallĕbaṁdirilo
valabu vāgiḍa vesi nilisina vayasu pallagilo

egāṁtasevagu urrūdalūgina śhṛṁgāra śhilbānivā
kalyāṇa rāmuni kaugiṭlo ŏdigina baṁgāru puṣhpānivā

paṁchugo priyadamā premanī .. premagā tīyagā tiyadīyagā ..tamagānivai prema !

kīravāṇi rāgaṁlo... pilisiṁdŏga hṛdayaṁ
kŏttagŏtta ūhalado... vaṇigiṁdŏga adharaṁ..

saraṇaṁ 2:

kadanasīmagu kāluduvvina gaḍusu manmathuḍā
kaugiliṁtala kāḍuvĕyyagu silibi saṁduruḍā

vevela sŏgasulu vĕchchaṁga pŏdigina vayyāri muṁduṁḍagā
maṁdāra pĕdavula gaṁdhālu tiyyaga ayyāre uṁḍedĕlā

aṁdugo adharame hāyigā egamai..ghāḍugā alavāḍugā.. tĕrasāḍugā bhāmā!

kīravāṇi rāgaṁlo.. pilisiṁdŏga hṛdayaṁ
kŏttagŏtta ūhalado...vaṇigiṁdŏga adharaṁ
gālilona telibovu...rājahaṁsavu nīvaṁṭā
ninnudāgi pŏṁgibovu... nīlimabbuni nenaṁṭā
vānalā vachchi varadalā... pŏṁgu premave nīvā
mĕrubulā maimarabulā... jadaseragā rāvā

kīravāṇi rāgaṁlo... pilisiṁdŏga hṛdayaṁ
kŏttagŏtta ūhalado... vaṇigiṁdŏga adharaṁ..