పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ
కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా
కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ
కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా
చరణం 1:
అనురాగ వీణపై.. మనసేమో నాదమై..
తీయ తీయగా మ్రోయగా పదములాడగా
సుదతి తనువే.. మదన ధనువై
అదను గని పదును పదును మరుల విరులు కురియగ
కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా
చరణం 2:
ఆ..ఆ..ఆ..ఆ
లలిత పవన కర చలిత జలదగతిలో...
నవ వికచ కుసుమ ముఖ ముఖర భ్రమర రుతిలో...
వనమే వధువై మనువే వరమై పులకించే ఈ వేళా
ఆషాఢ మేఘమే.. ఆనంద రాగమై..
చల చల్లగా ఝల్లుగా కవితలల్లగా
ప్రియుని తలపే.. పెళ్ళి పిలుపై..
చెలియకై ముత్యాల పందిట రత్నాల పల్లకి నిలుపగా
కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా
pallavi:
ā..ā..ā..ā
kavviṁche kaḽḽallo kalalevo evo evo kadalāḍe īveḽā
kavviṁche kaḽḽallo kalalevo evo evo kadalāḍe īveḽā
ā kalala kadaligala ūgĕnule tŏlagari valabula rasaḍolā..ā..ā
kavviṁche kaḽḽallo kalalevo evo evo kadalāḍe īveḽā
saraṇaṁ 1:
anurāga vīṇabai.. manasemo nādamai..
tīya tīyagā mroyagā padamulāḍagā
sudadi tanuve.. madana dhanuvai
adanu gani padunu padunu marula virulu kuriyaga
kavviṁche kaḽḽallo kalalevo evo evo kadalāḍe īveḽā
saraṇaṁ 2:
ā..ā..ā..ā
lalida pavana kara salida jaladagadilo...
nava vigasa kusuma mukha mukhara bhramara rudilo...
vaname vadhuvai manuve varamai pulagiṁche ī veḽā
āṣhāḍha meghame.. ānaṁda rāgamai..
sala sallagā jhallugā kavidalallagā
priyuni talabe.. pĕḽḽi pilubai..
sĕliyagai mutyāla paṁdiḍa ratnāla pallagi nilubagā
kavviṁche kaḽḽallo kalalevo evo evo kadalāḍe īveḽā