Karigelogaa ee kshanam

కరిగేలోగా ఈ క్షణం
Work
Year
Language

పల్లవి:

కరిగేలోగా ఈ క్షణం
గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం
అలలై పొంగే జ్ఞాపకం
కలలేజారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై
ఆ గమ్యం నీ గురుతుగా
నిలిచే నా ప్రేమా

చరణం 1:

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా....ఓ...
నా సగమేదో ప్రశ్నగ మారిందా....ఓ...
నేడీ బంధానికి పేరుందా....ఓ...
ఉంటే విడదీసే వీలుందా....ఓ...

చరణం 2:

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే
మరునిమిషంలో అలిగే పసివాడివలే
నీ పెదవులపై వాడని నవ్వులతోన
నువు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే....ఓ.....
నా బాధంతటి అందంగా ఉందే.....ఓ...
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే......ఓ....
మరుజన్మే క్షణమైనా చాలంతే....ఓ....

pallavi:

karigelogā ī kṣhaṇaṁ
gaḍibeyālī jīvidaṁ
śhilagā migile nā hṛdayaṁ sākṣhigā
kanulaiboye sāgaraṁ
alalai pŏṁge jñābagaṁ
kalalejāre kannīre seragā
gaḍise nimiṣhaṁ gāyamai
ā gamyaṁ nī gurudugā
nilise nā premā

saraṇaṁ 1:

parugulu tīstū alasina o nadi nenu
iru tīrāllo denigi seruva kānu
niduranu dāḍi naḍisina o kala nenu
iru kannullo denigi sŏṁtaṁ kānu
nā preme nestaṁ ayyiṁdā....o...
nā sagamedo praśhnaga māriṁdā....o...
neḍī baṁdhānigi peruṁdā....o...
uṁṭe viḍadīse vīluṁdā....o...

saraṇaṁ 2:

aḍiginavannī kādani paṁchistūne
marunimiṣhaṁlo alige pasivāḍivale
nī pĕdavulabai vāḍani navvuladona
nuvu pĕṁchāvā nī kannīḍini salli
sāge mī jaṁṭani sūstuṁṭe....o.....
nā bādhaṁtaḍi aṁdaṁgā uṁde.....o...
ī kṣhaṇame nūreḽḽavudānaṁṭe......o....
marujanme kṣhaṇamainā sālaṁte....o....