పల్లవి:
లలలా లలలా లలలా లలాలా
లలలా లలలా లలలా లలాలా
ఉహూహూ అహాహహా లలలలాలల లల
కనులు కనులు.. కలిసే సమయం
మనసు మనసు.. చేసే స్నేహం
నీ చేరువలో నీ చేతలలో.. వినిపించెను శ్రీ రాగం
కనులు కనులు.. కలిసే సమయం
మనసు మనసు.. చేసే స్నేహం
చరణం 1:
నీ నవ్వులో విరిసె మందారము.. నీ చూపులో కురిసె శృంగారము
నీ మాటలో ఉంది మమకారము.. నా ప్రేమకే నీవు శ్రీకారము
పరువాలు పలికేను సంగీతము.. నయనాలు పాడేను నవ గీతము
నేనే నీకు కానా ప్రాణం.. నీవే నాకు కావా లోకం
కనులు కనులు.. కలిసే సమయం
మనసు మనసు.. చేసే స్నేహం
చరణం 2:
నీ గుండె గుడిలో కొలువుండని.. నీ వెంట నీడల్లే నను సాగని
నీ పూల ఒడిలో నను చేరని.. నీ నుదుట సింధురమై నిలవని
చెవిలోన గుసగుసలు వినిపించని.. ఎదలోన మధురిమలు పండించని
నీలో నేనే కలగాను.. రోజూ స్వర్గం చూడాలంట
కనులు కనులు.. కలిసే సమయం
మనసు మనసు.. చేసే స్నేహం
నీ చేరువలో నీ చేతలలో.. వినిపించెను శ్రీ రాగం
లలల లలల.. లలల లలల..
pallavi:
lalalā lalalā lalalā lalālā
lalalā lalalā lalalā lalālā
uhūhū ahāhahā lalalalālala lala
kanulu kanulu.. kalise samayaṁ
manasu manasu.. sese snehaṁ
nī seruvalo nī sedalalo.. vinibiṁchĕnu śhrī rāgaṁ
kanulu kanulu.. kalise samayaṁ
manasu manasu.. sese snehaṁ
saraṇaṁ 1:
nī navvulo virisĕ maṁdāramu.. nī sūbulo kurisĕ śhṛṁgāramu
nī māḍalo uṁdi mamagāramu.. nā premage nīvu śhrīgāramu
paruvālu paligenu saṁgīdamu.. nayanālu pāḍenu nava gīdamu
nene nīgu kānā prāṇaṁ.. nīve nāgu kāvā logaṁ
kanulu kanulu.. kalise samayaṁ
manasu manasu.. sese snehaṁ
saraṇaṁ 2:
nī guṁḍĕ guḍilo kŏluvuṁḍani.. nī vĕṁṭa nīḍalle nanu sāgani
nī pūla ŏḍilo nanu serani.. nī nuduḍa siṁdhuramai nilavani
sĕvilona gusagusalu vinibiṁchani.. ĕdalona madhurimalu paṁḍiṁchani
nīlo nene kalagānu.. rojū svargaṁ sūḍālaṁṭa
kanulu kanulu.. kalise samayaṁ
manasu manasu.. sese snehaṁ
nī seruvalo nī sedalalo.. vinibiṁchĕnu śhrī rāgaṁ
lalala lalala.. lalala lalala..