Kannayyaa, nallani kannayyaa

కన్నయ్యా, నల్లని కన్నయ్యా
Year
Language

పల్లవి:

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా..ఆ..

చరణం 1:

గుణమెంత లేనింట పడవైతువా.. నన్ను వెలివేయువారికే బలిచేతువా
గుణమెంత లేనింట పడవైతువా.. నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరి జూచుకుని నన్ను మరిచావయా..
సిరి జూచుకుని నన్ను మరిచావయా.. మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయా

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా

చరణం 2:

బంగారు మనసునే ఒసగినావు.. అందు అందాల గుణమునే పొదిగినావు
బంగారు మనసునే ఒసగినావు.. అందు అందాల గుణమునే పొదిగినావు

మోముపై నలుపునే పులిమినావు..
మోముపై నలుపునే పులిమినావు.. ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా

pallavi:

kannayyā..ā.. nallani kannayyā..ā..
ninnu kanaleni kanuluṁḍunā
kannayyā..ā.. nallani kannayyā..ā..
ninnu kanaleni kanuluṁḍunā
ninnu premiṁture.. ninnu pūjiṁture
nannu ganinaṁta niṁdiṁture

kannayyā..ā.. nallani kannayyā..ā..
ninnu kanaleni kanuluṁḍunā
ninnu premiṁture.. ninnu pūjiṁture
nannu ganinaṁta niṁdiṁture
kannayyā..ā.. nallani kannayyā..ā..
ninnu kanaleni kanuluṁḍunā..ā..

saraṇaṁ 1:

guṇamĕṁta leniṁṭa paḍavaiduvā.. nannu vĕliveyuvārige baliseduvā
guṇamĕṁta leniṁṭa paḍavaiduvā.. nannu vĕliveyuvārige baliseduvā
siri jūsuguni nannu marisāvayā..
siri jūsuguni nannu marisāvayā.. maṁchi guḍi sūsugŏni nīvu murisevayā

kannayyā..ā.. nallani kannayyā..ā..
ninnu kanaleni kanuluṁḍunā

saraṇaṁ 2:

baṁgāru manasune ŏsagināvu.. aṁdu aṁdāla guṇamune pŏdigināvu
baṁgāru manasune ŏsagināvu.. aṁdu aṁdāla guṇamune pŏdigināvu

momubai nalubune pulimināvu..
momubai nalubune pulimināvu.. iṭlu nannela bradigiṁchadalasināvu

kannayyā..ā.. nallani kannayyā..ā..
ninnu kanaleni kanuluṁḍunā
ninnu premiṁture.. ninnu pūjiṁture
nannu ganinaṁta niṁdiṁture
kannayyā..ā.. nallani kannayyā..ā..
ninnu kanaleni kanuluṁḍunā