Kanaraani devude kanibimchinaade

కనరాని దేవుడే కనిపించినాడే
Year
Language

పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కనరాని దేవుడే కనిపించినాడే...కనిపించి అంతలో...
కన్ను మరుగాయే...కన్ను మరుగాయే..
కనరాని దేవుడే కనిపించినాడే...ఆ..ఆ..ఆ..ఆ

చరణం 1:

అల నీలీగగనాన వెలిగే నీ రూపూ..
అల నీలీగగనాన వెలిగే నీ రూపూ
ఆనంద బాష్పాల మునిగే నా చూపూ...
మనసారా నిను చూడలేనైతి స్వామీ...
కరుణించి ఒకసారి కనిపించవేమీ...

చరణం 2:

అందాల కన్నయ్య కనిపించగానే...
బృందావనమెల్ల పులకించిపొయే...
యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే...
నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే...ఆ..ఆ..ఆ..ఆ

చరణం 3:

వలపుతో పెనవేయు పారిజాతమునై...ఎదమీద నిదురించు అడియాశ లేదూ
గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై...నీ చరణకమలాల నలిగి పోనీయవా...

ఆ..ఆ..ఆ..ఆ..
కనరాని దేవుడే కనిపించినాడే...
కనిపించి అంతలో కన్ను మరుగాయే ...కన్ను మరుగాయే..

pallavi:

ā..ā..ā..ā..ā..ā
kanarāni devuḍe kanibiṁchināḍe...kanibiṁchi aṁtalo...
kannu marugāye...kannu marugāye..
kanarāni devuḍe kanibiṁchināḍe...ā..ā..ā..ā

saraṇaṁ 1:

ala nīlīgaganāna vĕlige nī rūbū..
ala nīlīgaganāna vĕlige nī rūbū
ānaṁda bāṣhpāla munige nā sūbū...
manasārā ninu sūḍalenaidi svāmī...
karuṇiṁchi ŏgasāri kanibiṁchavemī...

saraṇaṁ 2:

aṁdāla kannayya kanibiṁchagāne...
bṛṁdāvanamĕlla pulagiṁchibŏye...
yamunamma kĕraḍāla nĕlarāju navve...
navvulo rādhamma snānālu sese...ā..ā..ā..ā

saraṇaṁ 3:

valabudo pĕnaveyu pārijādamunai...ĕdamīda niduriṁchu aḍiyāśha ledū
gaḍḍilo virabūyu kannĕ kusumamunai...nī saraṇagamalāla naligi ponīyavā...

ā..ā..ā..ā..
kanarāni devuḍe kanibiṁchināḍe...
kanibiṁchi aṁtalo kannu marugāye ...kannu marugāye..