Kaluvagu samdrudu emto dooram..

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
Year
Language

పల్లవి:

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం..

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం..

దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం..
దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం..
విరహంలోనే వున్నది అనుబంధం.. !!కలువకు!!

చరణం 1:

నవ్వు నవ్వుకు తేడా వుంటుందీ..
నవ్వే అదృష్టం ఎందరికుంటుంది ??
ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుందీ..
అది కలిమిలేములను మరిపిస్తుంది.. !!కలువకు!!

చరణం 2:

వలపు కన్నా తలపే తీయనా...
కలయక కన్నా కలలే తీయనా..
చూపులకన్నా ఎదురు చూపులే తీయనా...
నేటికన్న రేపే తీయనా.. !!కలువకు!!

చరణం 3:

మనసు మనిషిని మనిషిగ చేస్తుందీ..
వలపా మనసుకు అందానిస్తుంది..
ఈ రెండూ లేక జీవితమేముంది??
ఆ దేవుడికి, మనిషికి, తేడా ఏముంది?? !!కలువకు!!

pallavi:

kaluvagu saṁdruḍu ĕṁto dūraṁ..
kamalānigi sūryuḍu marī dūraṁ..

kaluvagu saṁdruḍu ĕṁto dūraṁ..
kamalānigi sūryuḍu marī dūraṁ..

dūramaina kŏladī.. pĕrugunu anurāgaṁ..
dūramaina kŏladī.. pĕrugunu anurāgaṁ..
virahaṁlone vunnadi anubaṁdhaṁ.. !!kaluvagu!!

saraṇaṁ 1:

navvu navvugu teḍā vuṁṭuṁdī..
navve adṛṣhṭaṁ ĕṁdariguṁṭuṁdi ??
e kannīrainā vĕchchaga vuṁṭuṁdī..
adi kalimilemulanu maribistuṁdi.. !!kaluvagu!!

saraṇaṁ 2:

valabu kannā talabe tīyanā...
kalayaga kannā kalale tīyanā..
sūbulagannā ĕduru sūbule tīyanā...
neḍiganna rebe tīyanā.. !!kaluvagu!!

saraṇaṁ 3:

manasu maniṣhini maniṣhiga sestuṁdī..
valabā manasugu aṁdānistuṁdi..
ī rĕṁḍū lega jīvidamemuṁdi??
ā devuḍigi, maniṣhigi, teḍā emuṁdi?? !!kaluvagu!!