కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
పల్లవి:
ఏ కలవరమా...
ఓయ్ పరవశమా
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
పంచదార ఎంత తిన్నా చేదుగుందండి
చింతపండే కారమయ్యి చంపుతోందండి
అదేరా ప్రేమంటే కన్నా
ఎదంతా వ్యాపించి నీ దుంప తెంచే ప్రేమ
ప్రేమ....ప్రేమ..ప్రేమ
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
చరణం 1:
చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా
ఎండను చూస్తే చలి వేస్తోందా
ఓఓఓహో.....ఎదురుగా నువ్వున్నా విరహం పుడుతోంది
ఏ నిజమైనా కలగా వుంది
విసుగేదో కలిగింది
దిగులేదో పెరిగింది
అసలేదో జరిగింది
మతి కాస్తా పోయింది
అదేరా ప్రేమంటే చిన్నా
ఏదేదో చేసేసి నీ కొంప ముంచే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
చరణం 2:
చిటపట చినుకుల్లో పొడి పొడిగుంటోందా
చినుకే నీకు గొడుగయ్యిందా...
నిద్దురలో వున్నా మెలకువలా వుంది
మెలకువలోనే స్పృహ లేకుంది
చూపేమో చెదిరింది
మాటేమో వణికింది
అడుగసలే పడనంది
కుడి ఎడమై పోయింది
అదేరా ప్రేమంటే బచ్చా
అలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
పంచదార ఎంత తిన్నా చేదుగుందండి
చింతపండే కారమయ్యి చంపుతోందండి
అదేరా ప్రేమంటే కన్నా
ఎదంతా వ్యాపించి నీ దుంప తెంచే ప్రేమ
ప్రేమ....ప్రేమ..ప్రేమ
pallavi:
e kalavaramā...
oy paravaśhamā
kaḽḽalogi kaḽḽu pĕṭṭi sūḍalegunnā
sūḍaguṁḍā ŏkka nimiṣhaṁ uṁḍalegunnā
paṁchadāra ĕṁta tinnā seduguṁdaṁḍi
siṁtabaṁḍe kāramayyi saṁpudoṁdaṁḍi
aderā premaṁṭe kannā
ĕdaṁtā vyābiṁchi nī duṁpa tĕṁche prema
prema....prema..prema
kaḽḽalogi kaḽḽu pĕṭṭi sūḍalegunnā
sūḍaguṁḍā ŏkka nimiṣhaṁ uṁḍalegunnā
saraṇaṁ 1:
salisali gālullo vĕchchaga uṁṭoṁdā
ĕṁḍanu sūste sali vestoṁdā
oooho.....ĕdurugā nuvvunnā virahaṁ puḍudoṁdi
e nijamainā kalagā vuṁdi
visugedo kaligiṁdi
diguledo pĕrigiṁdi
asaledo jarigiṁdi
madi kāstā poyiṁdi
aderā premaṁṭe sinnā
ededo sesesi nī kŏṁpa muṁche prema
prema prema prema
kaḽḽalogi kaḽḽu pĕṭṭi sūḍalegunnā
sūḍaguṁḍā ŏkka nimiṣhaṁ uṁḍalegunnā
saraṇaṁ 2:
siḍabaḍa sinugullo pŏḍi pŏḍiguṁṭoṁdā
sinuge nīgu gŏḍugayyiṁdā...
nidduralo vunnā mĕlaguvalā vuṁdi
mĕlaguvalone spṛha leguṁdi
sūbemo sĕdiriṁdi
māḍemo vaṇigiṁdi
aḍugasale paḍanaṁdi
kuḍi ĕḍamai poyiṁdi
aderā premaṁṭe bachchā
alāge vedhiṁchi nī aṁtu sūse prema
prema prema prema
kaḽḽalogi kaḽḽu pĕṭṭi sūḍalegunnā
sūḍaguṁḍā ŏkka nimiṣhaṁ uṁḍalegunnā
paṁchadāra ĕṁta tinnā seduguṁdaṁḍi
siṁtabaṁḍe kāramayyi saṁpudoṁdaṁḍi
aderā premaṁṭe kannā
ĕdaṁtā vyābiṁchi nī duṁpa tĕṁche prema
prema....prema..prema