Kalayaa... nijamaa

కలయా... నిజమా
Year
Language

పల్లవి:

కలయా... నిజమా... తొలిరేయి హాయి మహిమా ..ఆ..ఆ
కలయా... నిజమా... తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ
అలవాటు లేని సుఖమా... ఇక నిన్ను ఆప తరమా
అణిగున్న ఆడతనమా.. ఇకనైన మేలుకొనుమా

కలయా... నిజమా... తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ
కలయా... నిజమా...

చరణం 1:

లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ.. అహా...
ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ..ఈ...
కోక ముళ్ళ కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నది...
కుర్ర కళ్ళు చీర గళ్ళలో... దారే లేక తిరుగుతున్నవి...
ముంచే మైకమో... మురిపించే మోహమో....

కలయా... నిజమా... తొలిరేయి హాయి మహిమా...ఆ..
కలయా... నిజమా...

చరణం 2:

చేయి వేయనా ..సేవ చేయనా.. ఓయ్ అనే వయ్యారమా.. హహ హ..
పాల ముంచినా ..నీట ముంచినా.. నీ దయే శృంగారమా... అహా...
ఆగలేని ఆకలేవిటో.. పైకి పైకి దూకుతున్నది
కాలు నేల నిలవకున్నది.. ఆకాశాన తేలుతున్నది..
హా అంతా మాయగా.. అనిపించే కాలమూ...

కలయా... నిజమా... తొలిరేయి హాయి మహిమా...
కలయా... నిజమా... తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ
అలవాటు లేని సుఖమా... ఇక నిన్ను ఆప తరమా
అణిగున్న ఆడతనమా.. ఇకనైన మేలుకొనుమా

కలయా...అహ.. నిజమా...అహ.. తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ
ఉహు..ఉహు..ఉహు...

pallavi:

kalayā... nijamā... tŏlireyi hāyi mahimā ..ā..ā
kalayā... nijamā... tŏlireyi hāyi mahimā..ā..ā
alavāḍu leni sukhamā... iga ninnu āba taramā
aṇigunna āḍadanamā.. iganaina melugŏnumā

kalayā... nijamā... tŏlireyi hāyi mahimā..ā..ā
kalayā... nijamā...

saraṇaṁ 1:

leniboni e kūnirāgamo lesirā aṁṭunnadī.. ahā...
ūrugoni e vĕrri korigo tīrsavā aṁṭunnadī..ī...
koga muḽḽa kūbī tīse kaibu sūbu kŏrugudunnadi...
kurra kaḽḽu sīra gaḽḽalo... dāre lega tirugudunnavi...
muṁche maigamo... muribiṁche mohamo....

kalayā... nijamā... tŏlireyi hāyi mahimā...ā..
kalayā... nijamā...

saraṇaṁ 2:

seyi veyanā ..seva seyanā.. oy ane vayyāramā.. haha ha..
pāla muṁchinā ..nīḍa muṁchinā.. nī daye śhṛṁgāramā... ahā...
āgaleni āgaleviḍo.. paigi paigi dūgudunnadi
kālu nela nilavagunnadi.. āgāśhāna teludunnadi..
hā aṁtā māyagā.. anibiṁche kālamū...

kalayā... nijamā... tŏlireyi hāyi mahimā...
kalayā... nijamā... tŏlireyi hāyi mahimā..ā..ā
alavāḍu leni sukhamā... iga ninnu āba taramā
aṇigunna āḍadanamā.. iganaina melugŏnumā

kalayā...aha.. nijamā...aha.. tŏlireyi hāyi mahimā..ā..ā
uhu..uhu..uhu...