పల్లవి:
తుషార శీతల సరోవరాన
అనంత నీరవ నిశీధిలోన
ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే
రాజా వెన్నెల రాజా....
కలనైనా నీ వలపే ||2||
కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే
చరణం 1:
కలువ మిఠారపు కమ్మని కలలు||2||
కళలూ కాంతులూ నీ కొరకేలే ||2||
చెలియారాధన సాధన నీవే
జిలిబిలి రాజా జాలి తలచరా
చరణం 2:
కనుల మనోరధ మాధురి గాంచి...ఆ ..ఆ..ఆ...
కనుల మనోరధ మాధురి గాంచి
కానుక చేసే వేళకు కాచి ||2||
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెరా
pallavi:
tuṣhāra śhīdala sarovarāna
anaṁta nīrava niśhīdhilona
ī kaluva nirīkṣhaṇa...nī kŏrage
rājā vĕnnĕla rājā....
kalanainā nī valabe ||2||
kalavaramaṁdainā nī talabe
kalanainā nī valabe
saraṇaṁ 1:
kaluva miṭhārabu kammani kalalu||2||
kaḽalū kāṁtulū nī kŏragele ||2||
sĕliyārādhana sādhana nīve
jilibili rājā jāli talasarā
saraṇaṁ 2:
kanula manoradha mādhuri gāṁchi...ā ..ā..ā...
kanula manoradha mādhuri gāṁchi
kānuga sese veḽagu kāsi ||2||
vāḍe regula vīḍani mamadala
veḍusu nīgai vesi nilasĕrā