Kadasaaridi veedkolu kanneedido maa sev

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్
Work
Year
Language

పల్లవి:

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ..

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ..ఓ..

చరణం 1:

తల్లి నేలని పల్లె సీమని విడతరమా.. తరమా
తల్లి నేలని పల్లె సీమని విడతరమా.. తరమా
ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా.. గలదా
జననానికి ఇది మా దేశం.. మరణానికి మరి ఏ దేశం
జననానికి ఇది మా దేశం.. మరణానికి మరి ఏ దేశం
కదిలే.. నదులారా.. కలలే.. అలలౌనా
జననీ... జన్మ భూమి.. స్వర్గాదపి గరీయసి
కన్నీటి తెరలలో తల్లి నేలని
కడసారి పేగు కనలేక కదిలిపోయేనూ..

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ..

చరణం 2:

పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే
పూల డోల నిన్నటి నిదర ముళ్ళు కదా ఇప్పటి నడక
ఉసురే మిగిలుంటే మరలా దరిచేరవా
మనసే.. మిగిలుంటే వొడిలో తలదాచవా
తలపే అల్పం.. తపనే అధికం
బరువెక్కిన హృదయం.. మోసుకునే పోతున్నా..ఆ..

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ..ఓ..

pallavi:

kaḍasāridi vīḍkolu kannīḍido mā sevrālu
aḍavi sĕṭlanu pāvurāḽḽanu kalalonainā kanagalamā
āśhalu samādhi sestū.. baṁdhālanu bali sestū
prāṇāle viḍisi sāge payanamidi o..

kaḍasāridi vīḍkolu kannīḍido mā sevrālu
aḍavi sĕṭlanu pāvurāḽḽanu kalalonainā kanagalamā
āśhalu samādhi sestū.. baṁdhālanu bali sestū
prāṇāle viḍisi sāge payanamidi o..o..

saraṇaṁ 1:

talli nelani pallĕ sīmani viḍadaramā.. taramā
talli nelani pallĕ sīmani viḍadaramā.. taramā
unna ūrilo unna saukhyamu svargamivvagaladā.. galadā
jananānigi idi mā deśhaṁ.. maraṇānigi mari e deśhaṁ
jananānigi idi mā deśhaṁ.. maraṇānigi mari e deśhaṁ
kadile.. nadulārā.. kalale.. alalaunā
jananī... janma bhūmi.. svargādabi garīyasi
kannīḍi tĕralalo talli nelani
kaḍasāri pegu kanalega kadiliboyenū..

kaḍasāridi vīḍkolu kannīḍido mā sevrālu
aḍavi sĕṭlanu pāvurāḽḽanu kalalonainā kanagalamā
āśhalu samādhi sestū.. baṁdhālanu bali sestū
prāṇāle viḍisi sāge payanamidi o..

saraṇaṁ 2:

pāḍe jolalu pābala eḍpula pālaibode
pāḍe jolalu pābala eḍpula pālaibode
udaya sūryuḍe vilaya dhūmabu tĕralo dāge
pūla ḍola ninnaḍi nidara muḽḽu kadā ippaḍi naḍaga
usure migiluṁṭe maralā dariseravā
manase.. migiluṁṭe vŏḍilo taladāsavā
talabe albaṁ.. tabane adhigaṁ
baruvĕkkina hṛdayaṁ.. mosugune podunnā..ā..

kaḍasāridi vīḍkolu kannīḍido mā sevrālu
aḍavi sĕṭlanu pāvurāḽḽanu kalalonainā kanagalamā
āśhalu samādhi sestū.. baṁdhālanu bali sestū
prāṇāle viḍisi sāge payanamidi o..o..