Kaastamdugo, darakhaastamdugo

కాస్తందుకో, దరఖాస్తందుకో
Year
Language

పల్లవి:

కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ దర ఖాస్తందుకో!
ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో!

ఆ ఆ ఆ కాస్తందుకో, దరఖాస్తందుకో, భామ దర ఖాస్తందుకో!
దగ్గర చేరి దత్తతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో!

చరణం 1:

చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు(2)
మెరుపంత నవ్వునా చినుకైన రాలునా?
ఆ ఆ ఆ ఆ ఆ ఆహాహహా

జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు (2)
వరదల్లె పొంగునా కడలింట చేరునా?

శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే!

చరణం 2:

చలిగాలి దరఖాస్తు తొలియీడు వినకుంటే (2)
చెలి జంట చేరునా చెలిమల్లే మారునా?

ఆ ఆ ఆ ఆ ఆ లలలల లాలాలలా

నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు (2)
ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?

దరి చేరి కూడా దరఖాస్తులేలా?

pallavi:

kāstaṁdugo, darakhāstaṁdugo, prema dara khāstaṁdugo!
mudduladone muddaravesi preyasi kaugili aṁdugo!

ā ā ā kāstaṁdugo, darakhāstaṁdugo, bhāma dara khāstaṁdugo!
daggara seri dattadu sesi preyasi kaugili aṁdugo!

saraṇaṁ 1:

sirugāli darakhāstu leguṁṭe karimabbu(2)
mĕrubaṁta navvunā sinugaina rālunā?
ā ā ā ā ā āhāhahā

jaḍivāna darakhāstu paḍaguṁṭe sĕlayeru (2)
varadallĕ pŏṁgunā kaḍaliṁṭa serunā?

śhubhamastu aṁṭe darakhāstu oge!

saraṇaṁ 2:

saligāli darakhāstu tŏliyīḍu vinaguṁṭe (2)
sĕli jaṁṭa serunā sĕlimalle mārunā?

ā ā ā ā ā lalalala lālālalā

nĕlavaṁka darakhāstu leguṁṭe sĕkkiḽḽu (2)
ĕrubĕkkibovunā? ĕnnĕllu paṁḍunā?

dari seri kūḍā darakhāstulelā?