పల్లవి:
ఆ..ఆ.ఆ..ఆ.ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే..
తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే...
రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే...
మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే....
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది...
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే..
తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే...
రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే...
మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే....
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది...
చరణం 1:
అమ్మడూ... నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే..
కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే...
పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే..
మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే...
చిన్ననాడే అన్నప్రాసనయ్యిందోయ్..
కన్నెగారి వన్నె ప్రాసనవ్వాలోయ్..
అమ్మ చేతి గోరుముద్ద తిన్నానోయ్
అందగాడి గోటి ముద్ర కావాలోయ్
ఓ..ఓ..ఓ..ఒ...
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే..
కోరుకున్న చోట నువ్వు నేను చేరుకుంటే...
చేరుకున్న చోట ఉన్న దీపమారుతుంటే...
ఆరుతున్న వేళ కన్నె కాలు జారుతుంటే...
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది...
చరణం 2:
మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే...
గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే..
కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే..
పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే..
బుగ్గలోన రాలుతుంది జాంపండు ...
పక్కలోన రాలుతుంది ప్రేం పండు..
రాతిరేల వచ్చిపోరా రాంపండు..
బంతులాడి పుచ్చుకోరా భాం పండు..
కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే...
ఆపుకుంటే నేను నిన్ను జాలి చూపమంటే..
చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే..
రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడంటే....
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది..
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది...
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది...ఈ...ఈ..
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది...ఈ..ఈఎ