Kaadamtaanaa sarasam sedamtaanaa

కాదంటానా సరసం చేదంటానా
Work
Year
Language

పల్లవి:

కాదంటానా.. సరసం చేదంటానా
లేదంటానా.. అడిగిన దేదైనా
దారం లాగుతుంది మమకారం.. ఆపినా
దూరం తెంచమంది చెలి దేహం.. ఏదేమైనా

మేనక.. వయ్యారి మేనక.. చిలిపి కోరిక తీరక ఏంటా తికమక
వేడుక.. వలపు వేదిక.. కబురు పంపిన విందుకు రావే చక చక

హే.. నింగి నేల నీరు గాలి నిప్పయ్యే తమాషా
ఆగే వీలే లేదంటుంది నాలో పదనిస

హే.. అందంలోని తొందర్లన్నీ అంతో ఇంతో ఆరా తీసా
అడగని బదులుగా తీర్చనా నీ నిషా

చరణం 1:

నా పరువం.. నీ కొరకే.. హాయి పండించుకో
పెదాల తోటలో ఫలాలు పంచుకో.. మరింత మోజులో నన్నేలుకో

ధగ ధగ చమక్కేదో లాగిందే గుచ్చి గుచ్చి చూసిందే
దిమ్మెక్కేలా నన్నేదో చేసిందే
ఘుమ ఘుమ గమ్మత్తేదో లాగిందే రెచ్చి రెచ్చి ఊగిందే
నచ్చి మెచ్చి నన్నే గిచ్చి రచ్చ రచ్చ చేసేసిందే

చరణం 2:

ఏదో దాహం.. తహతహ లాడే దాహం
నీపై మోహం.. తరగని వ్యామోహం
నీలా గుచ్చుకుంది విరి బాణం.. నన్నిలా
చాలా నొచ్చుకుంది చెలి ప్రాణం.. జాలే లేదా

హే పిల్లా ఏ పిల్లా ఏ పిల్లా నీ కంటి చూపుల లోపల ఏంటా సలసల
అంతలా అందాల వింతలా నీ ఒంటి సొంపుల కెంపుల కేంటా విల విల

హే పిల్లా నాలా ఘల్లంటుంది సింగారాల వీణ
ఒళ్ళో వాలే బంగారంలా నీలో ఒదగనా
ఉయ్యాలూగే ఉల్లాసాన్ని నావైపిలా పిలవనా
పగడపు పెదవికి మధువులు పొదగనా

pallavi:

kādaṁṭānā.. sarasaṁ sedaṁṭānā
ledaṁṭānā.. aḍigina dedainā
dāraṁ lāguduṁdi mamagāraṁ.. ābinā
dūraṁ tĕṁchamaṁdi sĕli dehaṁ.. edemainā

menaga.. vayyāri menaga.. silibi koriga tīraga eṁṭā tigamaga
veḍuga.. valabu vediga.. kaburu paṁpina viṁdugu rāve saga saga

he.. niṁgi nela nīru gāli nippayye tamāṣhā
āge vīle ledaṁṭuṁdi nālo padanisa

he.. aṁdaṁloni tŏṁdarlannī aṁto iṁto ārā tīsā
aḍagani badulugā tīrsanā nī niṣhā

saraṇaṁ 1:

nā paruvaṁ.. nī kŏrage.. hāyi paṁḍiṁchugo
pĕdāla toḍalo phalālu paṁchugo.. mariṁta mojulo nannelugo

dhaga dhaga samakkedo lāgiṁde guchchi guchchi sūsiṁde
dimmĕkkelā nannedo sesiṁde
ghuma ghuma gammattedo lāgiṁde rĕchchi rĕchchi ūgiṁde
nachchi mĕchchi nanne gichchi rachcha rachcha sesesiṁde

saraṇaṁ 2:

edo dāhaṁ.. tahadaha lāḍe dāhaṁ
nībai mohaṁ.. taragani vyāmohaṁ
nīlā guchchuguṁdi viri bāṇaṁ.. nannilā
sālā nŏchchuguṁdi sĕli prāṇaṁ.. jāle ledā

he pillā e pillā e pillā nī kaṁṭi sūbula lobala eṁṭā salasala
aṁtalā aṁdāla viṁtalā nī ŏṁṭi sŏṁpula kĕṁpula keṁṭā vila vila

he pillā nālā ghallaṁṭuṁdi siṁgārāla vīṇa
ŏḽḽo vāle baṁgāraṁlā nīlo ŏdaganā
uyyālūge ullāsānni nāvaibilā pilavanā
pagaḍabu pĕdavigi madhuvulu pŏdaganā