Title (Indic)బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గు WorkJemini Year2003 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer Balasubramaniam S.P. Writer Balasubramaniam S.P. LyricsTeluguపల్లవి: బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా (2) జాబిల్లిలా ఉంది జాణ ఆ నవ్వు మీటింది వీణ ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈరోజే చూసానుగా బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా చరణం 1: నీలాల ఆ కళ్ళలో నీరెంత దాగున్నదో ఆ లేడి కూనమ్మా ఈ వింత చూసుంటే ఏమంటదో ఆ పాలచెక్కిళ్ళలో మందారమే పూచెనో ఈ చోద్యమే చూసి అందాల గోరింక ఏమంటదో నా గుండె దోసిల్లు నిండాయిలే నేడు ఆ నవ్వు ముత్యాలతో ఈ జ్ఞాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో బ్రహ్మా ఓ బ్రహ్మా మహముద్దుగా ఉంది గుమ్మా బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా చరణం 2: నూరేళ్ళ ఈ జన్మని ఇచ్చింది నువ్వేనని ఏ పూజలు రాని నేనంటే నీకెంత ప్రేముందనీ ఈ వేళ ఈ హాయిని నా గుండెనే తాకని అందాల ఆ రాణి కౌగిళ్ళలో వాలి జీవించనీ ఆ పంచబూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లంగా దీవించని తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమని Englishpallavi: brahmā o brahmā mahamuddugā uṁdi gummā bŏmmā ī bŏmmā arĕ aṁdānige aṁdamā (2) jābillilā uṁdi jāṇa ā navvu mīḍiṁdi vīṇa eḍeḍu logālalo iṁta aṁdānni īroje sūsānugā brahmā o brahmā mahamuddugā uṁdi gummā bŏmmā ī bŏmmā arĕ aṁdānige aṁdamā saraṇaṁ 1: nīlāla ā kaḽḽalo nīrĕṁta dāgunnado ā leḍi kūnammā ī viṁta sūsuṁṭe emaṁṭado ā pālasĕkkiḽḽalo maṁdārame pūsĕno ī sodyame sūsi aṁdāla goriṁka emaṁṭado nā guṁḍĕ dosillu niṁḍāyile neḍu ā navvu mutyālado ī jñābagālanni ne dāsuguṁṭānu premado brahmā o brahmā mahamuddugā uṁdi gummā bŏmmā ī bŏmmā arĕ aṁdānige aṁdamā saraṇaṁ 2: nūreḽḽa ī janmani ichchiṁdi nuvvenani e pūjalu rāni nenaṁṭe nīgĕṁta premuṁdanī ī veḽa ī hāyini nā guṁḍĕne tāgani aṁdāla ā rāṇi kaugiḽḽalo vāli jīviṁchanī ā paṁchabūdālu ŏkkŏkkaḍai vachchi sallaṁgā dīviṁchani tana sĕṁtage seri e roju sĕppāli premani