Title (Indic)ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా WorkJayam Year2002 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer Usha Performer R. P. Patnaik Writer Usha LyricsTeluguపల్లవి: ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా..ఆ.. చరణం 1: కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా..ఆ.. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. చరణం 2: ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంటా.. ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరురా కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా ప్రేమకెపుడైనా జయమే గాని ఓటమి లేదంట..ఆ ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా శాశ్వతమీ ప్రేమా.. Englishpallavi: ĕvvaru emannā māradu ī premā ĕvarū rāgunnā āgadu ī premā nĕttuḍi kattigi enāḍū lŏṁgadu ī premā mĕttani manasunu e roju vīḍadu ī premā kulamu madamu levaṁṭuṁdi manasugi ī premā niṁgī nela unnannāḽḽu uṁṭuṁdī premā ĕvvaru emannā māradu ī premā.. ĕvarū rāgunnā āgadu ī premā..ā.. saraṇaṁ 1: kālamŏste sirimallĕ tīgagi sigure puḍuduṁdi īḍu vaste ī paḍusu guṁḍĕlo preme puḍuduṁdi gŏḍugu aḍḍubĕṭṭinaṁtane vāna jallu āgibovunā gulagarāyi vesinaṁtane varada joru āgibovunā eḍu logālu egaṁ ayinā premanu ābenā..ā.. ĕvvaru emannā māradu ī premā.. ĕvarū rāgunnā āgadu ī premā.. saraṇaṁ 2: prema aṁṭe ā devuḍichchina sakkani varamaṁṭā.. prema uṁṭe ī manasugĕppuḍū alube rādaṁṭa kaṁḍalĕṁta pĕṁchugŏchchinā kŏṁḍanĕtti diṁchalerurā kakṣhadoḍi kālu duvvinā premanĕvvarābalerugā premagĕbuḍainā jayame gāni oḍami ledaṁṭa..ā ĕvvaru emannā māradu ī premā ĕvarū rāgunnā āgadu ī premā.. nĕttuḍi kattigi enāḍū lŏṁgadu ī premā mĕttani manasunu e roju vīḍadu ī premā kulamu madamu levaṁṭuṁdi manasugi ī premā niṁgī nela unnannāḽḽu uṁṭuṁdī premā śhāśhvadamī premā..