Jallamta kavvimta

జల్లంత కవ్వింత
Work
Year
Language

పల్లవి:

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

చరణం 1:

వాగులు వంకులు గలగలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి
వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

చరణం 2:

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలికొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో ఒహో

pallavi:

jallaṁta kavviṁta kāvālile ŏḽḽaṁta tuḽḽiṁta rāvālile
jallaṁta kavviṁta kāvālile ŏḽḽaṁta tuḽḽiṁta rāvālile
urugulo parugulo
uḍugu vayasu duḍugudanamu nilavadu
tŏlagari mĕrubulā
uligibaḍina kaligi sŏgasu

kŏṁḍamma konamma mĕchchiṁdile ĕṁḍallŏ vĕnnĕllu tĕchchiṁdile
kŏṁḍamma konamma mĕchchiṁdile ĕṁḍallŏ vĕnnĕllu tĕchchiṁdile

saraṇaṁ 1:

vāgulu vaṁkulu galagalā silibigā pilisinā
gālulu vānalu siḍabaḍā sinugule siliginā
manasu āgadu idemi allaro
tanuvu dāgadu ademi tāgiḍo
konasāḍu kŏṁḍamallĕ lenivaṁka muddulāḍi
vĕḽḽaḍāyĕ kaḽḽu leni devuḍĕṁdugo mari

saraṇaṁ 2:

saṁdĕlo raṁgule nŏsaḍibai tilagame nilubagā
tĕli tĕli maṁchule tĕliyani tabanale tĕlubagā
vānadevuḍe kaḽḽābi jallagā
vāyudevuḍe muggesi vĕḽḽagā
nīligŏṁḍa guṁḍĕloni ūsulanni tĕlusugunna
kŏtta pāḍa puṭṭugŏchchĕ ĕvarigosamo ŏho