జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏన&
పల్లవి:
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం... మన జీవన పారాయణం
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
చరణం 1:
చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది
వలపు స్వయం వరమైనపుడు గెలువనిది ఏది
ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి
తొలి చుక్కవు నీవే చుక్కాణివి నీవే
తుదిదాకా నీవే మరు జన్మకు నీవే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జానకి కలగనలేదు||
చరణం 2:
సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం
సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం
గతమంటే నీవే కధకానిది నీవే
కలలన్ని నావే కలకాలం నీవే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాముడు అనుకోలేదు ||
pallavi:
jānagi kalaganaledu rāmuni sadi kāgalanani enāḍu
rāmuḍu anugoledu jānagi padi kāgalanani ānāḍu
ānāḍu ĕvarū anugonidi ināḍu managu nijamainadi
ā rāmāyaṇaṁ... mana jīvana pārāyaṇaṁ
rāmuḍu anugoledu jānagi padi kāgalanani ānāḍu
saraṇaṁ 1:
sĕlimanase śhivadhanassu ayinadi tŏlisūbula vaśhamainadi
valabu svayaṁ varamainabuḍu gĕluvanidi edi
ŏga bāṇaṁ ŏga bhāryannadi śhrīrāmuni sirayaśhamainadi
śhrīvāru ā varamiste sirulanni nāvi
tŏli sukkavu nīve sukkāṇivi nīve
tudidāgā nīve maru janmagu nīve
ā ā ā ā ā ā ā
jānagi kalaganaledu||
saraṇaṁ 2:
sahavāsaṁ managu nivāsaṁ sarihaddu nīlāgāśhaṁ
pradibŏddu praṇayāveśhaṁ pĕdavulabai hāsaṁ
sumasāraṁ mana saṁsāraṁ maṇihāraṁ mana mamagāraṁ
pradiroju ŏga śhrīgāraṁ paravaśha śhṛṁgāraṁ
gadamaṁṭe nīve kadhagānidi nīve
kalalanni nāve kalagālaṁ nīve
ā ā ā ā ā ā ā
rāmuḍu anugoledu ||