జాబిలితో చెప్పనా..
పల్లవి:
జాబిలితో చెప్పనా..
జాబిలితో చెప్పనా.. జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా !
జాబిలితో చెప్పనా..
జాబిలితో చెప్పనా .. జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా !
చరణం 1:
తుమ్మెదలంటని తేనెలకై .. తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో .. సిగ్గులు కలవని విరహాలు
చూపులలో చలి చురచురలూ ..
ఆ చలితీరని విరవిరలూ ...
అన్ని ఆవిరి పెడుతుంటే ... నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా !!!
చరణం 2:
గొంతులు దాచిన గుండెలలో .. కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడనని గంగలలో .. అలలై పొంగిన అందాలు
కౌగిట కాముని పున్నములు ..
వెన్నెల వీణల సరిగమలు ..
పేరంటానికి రమ్మంటే ... పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని
చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా !!!
pallavi:
jābilido sĕppanā..
jābilido sĕppanā.. jāmurādiri niduralona nīvu sesina allari sĕppanā... rojā !
jābilido sĕppanā..
jābilido sĕppanā .. jāmurādiri kalalalona nīvu rebina alajaḍi sĕppanā.. rājā !
saraṇaṁ 1:
tummĕdalaṁṭani tenĕlagai .. tuṁṭari pĕdavigi dāhālu
sukkalu sūḍani sīgaḍilo .. siggulu kalavani virahālu
sūbulalo sali surasuralū ..
ā salidīrani viraviralū ...
anni āviri pĕḍuduṁṭe ... nanne allari pĕḍudunnāvani
sĕppanā .. ā .. sĕppanā .. ā .. sĕppanā !!!
saraṇaṁ 2:
gŏṁtulu dāsina guṁḍĕlalo .. koyila pāḍani gīdālu
sūryuḍu sūḍanani gaṁgalalo .. alalai pŏṁgina aṁdālu
kaugiḍa kāmuni punnamulu ..
vĕnnĕla vīṇala sarigamalu ..
peraṁṭānigi rammaṁṭe ... pĕḽḽigi pĕddavu nīvelĕmmani
sĕppanā .. ā .. sĕppanā .. ā .. sĕppanā !!!