Imtimti raamaayanam vimtaina premaayanam

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
Year
Language

పల్లవి:

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం అహహ

చరణం 1:

నీవుంటే నందనవనము లేకుంటే అశోకవనము
నీవుంటే నందనవనము లేకుంటే అశోకవనము
నీవాడే ఊసులన్ని రతనాల రాశులే
నీవుంటే పూలబాట లేకుంటే రాళ్ళబాట
నీవుంటే పూలబాట లేకుంటే రాళ్ళబాట
నీతోటి ఆశలన్ని సరసాల పాటలు ముత్యాల మూటలు

చరణం 2:

అల్లల్లే ఎహే ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
చిలకమ్మ గోరింక అ సిరిమల్లే అ పొదరినట
చిలకమ్మ గోరింక సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

సరి అంచు చీరలు తెస్తా కవరింగు సరుకులు పెడతా
సరి అంచు చీరలు తెస్తా కవరింగు సరుకులు పెడతా
తెమ్మంటే మాయలేడి తేలేనే నిన్నొదిలి
ఓ ఓ ఓ ఓ ఒహొహొహొహొ హొయ్
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
కీచులాడుకున్న నువ్వు రోషమొచ్చి పోకురా కలిసి మెలిసి ఉండరా
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం ఓయ్

చరణం 3:

ఇల్లేకద స్వర్గసీమ ఇద్దరిది చెరగని ప్రేమ
ఇల్లేకద స్వర్గసీమ ఇద్దరిది చెరగని ప్రేమ
కలతలేని కాపురాన కలలన్ని పండాలి

అహహహహ మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మన ఇద్దరి పొందికచూసి ఈ లోకం మెచ్చాలి దీవెనలే ఇవ్వాలి

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ రామయ్య గోరింక వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము

pallavi:

iṁṭiṁṭi rāmāyaṇaṁ viṁtaina premāyaṇaṁ
kalisuṁṭe sallābamu viḍibode kallolamu
iṁṭiṁṭi rāmāyaṇaṁ viṁtaina premāyaṇaṁ
kalisuṁṭe sallābamu viḍibode kallolamu
sīdamma silagamma rāmayya goriṁka
valabula talabula sarāgaṁ
iṁṭiṁṭi rāmāyaṇaṁ viṁtaina premāyaṇaṁ ahaha

saraṇaṁ 1:

nīvuṁṭe naṁdanavanamu leguṁṭe aśhogavanamu
nīvuṁṭe naṁdanavanamu leguṁṭe aśhogavanamu
nīvāḍe ūsulanni radanāla rāśhule
nīvuṁṭe pūlabāḍa leguṁṭe rāḽḽabāḍa
nīvuṁṭe pūlabāḍa leguṁṭe rāḽḽabāḍa
nīdoḍi āśhalanni sarasāla pāḍalu mutyāla mūḍalu

saraṇaṁ 2:

allalle ĕhe iṁṭiṁṭi rāmāyaṇaṁ viṁtaina premāyaṇaṁ
kalisuṁṭe sallābamu viḍibode kallolamu
silagamma goriṁka a sirimalle a pŏdarinaḍa
silagamma goriṁka sirimalle pŏdariṁṭa navvāli navvāli
kalisi kilagila navvāli kalisi kilagila navvāli
iṁṭiṁṭi rāmāyaṇaṁ viṁtaina premāyaṇaṁ

sari aṁchu sīralu tĕstā kavariṁgu sarugulu pĕḍadā
sari aṁchu sīralu tĕstā kavariṁgu sarugulu pĕḍadā
tĕmmaṁṭe māyaleḍi telene ninnŏdili
o o o o ŏhŏhŏhŏhŏ hŏy
mabbullo nīḽḽu sūsi muṁta ŏlagabosugonu
mabbullo nīḽḽu sūsi muṁta ŏlagabosugonu
kīsulāḍugunna nuvvu roṣhamŏchchi pogurā kalisi mĕlisi uṁḍarā
iṁṭiṁṭi rāmāyaṇaṁ viṁtaina premāyaṇaṁ oy

saraṇaṁ 3:

illegada svargasīma iddaridi sĕragani prema
illegada svargasīma iddaridi sĕragani prema
kaladaleni kāburāna kalalanni paṁḍāli

ahahahaha mojunna ālumagalu kulagāli reyibagalu
mojunna ālumagalu kulagāli reyibagalu
mana iddari pŏṁdigasūsi ī logaṁ mĕchchāli dīvĕnale ivvāli

iṁṭiṁṭi rāmāyaṇaṁ viṁtaina premāyaṇaṁ
kalisuṁṭe sallābamu viḍibode kallolamu
sīdamma silagamma rāmayya goriṁka valabula talabula sarāgaṁ
iṁṭiṁṭi rāmāyaṇaṁ viṁtaina premāyaṇaṁ kalisuṁṭe sallābamu viḍibode kallolamu