Imtagoo nuvvevaroo

ఇంతకూ నువ్వెవరూ
Work
Year
Language

పల్లవి:

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధం మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ..

చరణం 1:

ఎందుకో ఏమిటో చెప్పలేను కానీ .. కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో .. మరిచాను గుండెలోని జ్వాల
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నది

చరణం 2:

ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే ..నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే ..చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పెవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందని

pallavi:

iṁtagū nuvvĕvarū varasagu nāgĕvarū
aṁtagā guchchiguchchi sĕppeḍaṁdugu nenĕvarū
iṁtagū muṁdĕvarū iṁtagā nāgĕvarū
sĕṁtagu vachchi vachchi sĕppinavāre lerĕvarū
ŏga nimuṣhaṁ kobamudo maru nimuṣhaṁ navvulado
nanu muribistāvu maribistāvu ĕṁdugo
nī paṁtamu emiḍanī e baṁdhaṁ manadi ani
nenu ālosiste badule dŏragadu ĕṁtagū..

saraṇaṁ 1:

ĕṁdugo emiḍo sĕppalenu kānī .. kalisāvu tiyyanaina veḽa
sanuvudo silibigā nīve masaluduṁṭe nādo .. marisānu guṁḍĕloni jvāla
o tŏlagari snehamā nestamā emi māyo idi
nī aḍugula nīḍalo kālame nilisi sūstunnadi

saraṇaṁ 2:

ĕvaranī sūḍaga nāgai parugu tīstū uṁṭe ..nī tīre āśha rebĕ nālo
nuvvalā kasurudū nāge adubu nerbuduṁṭe ..sūsāle nannu nenu nīlo
priyamaina samayamā gamanamā sĕppĕve adanigi
ī siru siru payaname madhuramai nilisiboduṁdani