పల్లవి:
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు ॥తీయని॥
చరణం 1:
ఆ... హా హా హా... ఆహా... ఆహాహా...
సుజా... !
నడిరాతిరి వేళ నీ పిలుపు .. గిలిగింతలతో నను ఉసిగొలుపు
నడిరాతిరి వేళ నీ పిలుపు .. గిలిగింతలతో నను ఉసిగొలుపు
నును చేతులతో నను పెనవేసి .. నా ఒడిలో వాలును నీవలపు
చరణం 2:
నా మనసే కోవెల చేసితిని .. ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని .. ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు .. కనువిందులు చేసే శిల్పాలు
చరణం 3:
నీ పెదవులు చిలికే మధురిమలు .. అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు .. అనురాగము పలికే సరిగమలు
మన తనువులు కలిపే రాగాలు .. కలకాలం నిలిచే కావ్యాలు
pallavi:
idi tīyani vĕnnĕla reyi
madi vĕnnĕla kannā hāyi
nā ūhala jābili rekhalu
kuribiṁchĕnu premalekhalu ||tīyani||
saraṇaṁ 1:
ā... hā hā hā... āhā... āhāhā...
sujā... !
naḍirādiri veḽa nī pilubu .. giligiṁtalado nanu usigŏlubu
naḍirādiri veḽa nī pilubu .. giligiṁtalado nanu usigŏlubu
nunu sedulado nanu pĕnavesi .. nā ŏḍilo vālunu nīvalabu
saraṇaṁ 2:
nā manase kovĕla sesidini .. ā guḍilo ninne nilibidini
nā manase kovĕla sesidini .. ā guḍilo ninne nilibidini
nī ŏṁpulu tirige aṁdālu .. kanuviṁdulu sese śhilbālu
saraṇaṁ 3:
nī pĕdavulu silige madhurimalu .. anurāgamu palige sarigamalu
nī pĕdavulu silige madhurimalu .. anurāgamu palige sarigamalu
mana tanuvulu kalibe rāgālu .. kalagālaṁ nilise kāvyālu