Idi sallani velainaa

ఇది చల్లని వేళైనా
Year
Language

పల్లవి:

నేరుతునో లేదో ప్రభూ...నీ పాటలు పాడా...

ఇది చల్లని వేళైనా...ఇది వెన్నెల రేయైనా
నిదుర రాదు కనులకు...శాంతి లేదు మనసుకు
మదిలో వేదన ఏదో...రగిలే రాధకు
ఇది చల్లని వేళైనా...

చరణం 1:

నీ దయలాగున వెన్నెల...జగమంతా ముంచే
నీ మధుర ప్రేమా..యమున కడలంతా నింపే
మరి మరి ముల్లోకములను...మురిపించే స్వామీ
మనసు చల్ల పడటానికి...కనిపించవేమీ
ఇది చల్లని వేళైనా

చరణం 2:

నీ వేణువు కోసం...బ్రతుకంతా వీనులాయే
నీ దర్శనమునకై...ఒడలంతా కనులాయే
బడలే బ్రతుకున ఆశలు...వెలిగించే దేవా
కదలే వీణియ తీగలు...సవరించి పోవా
ఇది చల్లని వేళైనా...ఇది వెన్నెల రేయైనా

pallavi:

neruduno ledo prabhū...nī pāḍalu pāḍā...

idi sallani veḽainā...idi vĕnnĕla reyainā
nidura rādu kanulagu...śhāṁti ledu manasugu
madilo vedana edo...ragile rādhagu
idi sallani veḽainā...

saraṇaṁ 1:

nī dayalāguna vĕnnĕla...jagamaṁtā muṁche
nī madhura premā..yamuna kaḍalaṁtā niṁpe
mari mari mullogamulanu...muribiṁche svāmī
manasu salla paḍaḍānigi...kanibiṁchavemī
idi sallani veḽainā

saraṇaṁ 2:

nī veṇuvu kosaṁ...bradugaṁtā vīnulāye
nī darśhanamunagai...ŏḍalaṁtā kanulāye
baḍale braduguna āśhalu...vĕligiṁche devā
kadale vīṇiya tīgalu...savariṁchi povā
idi sallani veḽainā...idi vĕnnĕla reyainā