Idi ranarangamaa lega agni gumdamaa

ఇది రణరంగమా లేక అగ్ని గుండమా
Year
Language

పల్లవి:

ఇది రణరంగమా లేక అగ్ని గుండమా
విధి నడిపే ప్రేమ అర్ధమవదే.......
ఇది రణరంగమా లేక అగ్ని గుండమా
విధి నడిపే ప్రేమ అర్ధమవదే

చరణం 1:

అగ్ని కణము.. నీటి గుణము.. రెంటిని కలిపితే నువ్వేనా...
ఇవతలి వైపు దేవతవైతే అవతలి వైపు దెయ్యమువా
సమయం తింటావ్.. మెదడుని తింటావ్
నన్నే తింటావ్ తప్పు కాదా..
పని పాట లేని పిల్లా ఇంట్లో నీకు తిండి లేదా..
చూపులు తగలగ... మాటలు పెగలగ..
ఉరుములు మెరుపులు ఆరంభం..
పాదం.. కేశం.. నాభి.. కమలం రగులుకొనగా ఆనందం
ధగ ధగమని వెలిగెను జ్వాల... సెగ సెగమని ఎగిరెను బాలా
తహతహమని తపనల గోల ...కసి కసియని కౌగిలి ఏలా

చరణం 2:

మిత్రుల బృందం ఎదురే వస్తే పక్కకి తొలగి నడిచితిని
పొద్దున్న నిన్ను చూస్తానంటూ రాత్రినంతా గడిపితిని...
ఇట్టా ఇట్టా రోజులు గడపగ ఇంకా నన్నేం చేస్తావు...
మాయా మంత్రం తెలిసిన దానా త్వరగా నన్ను చంపెదవా...
ఏ తాడైనా నీ తలపుల్ని బిగిసేలాగ కడుతుందా..
నన్నే కాల్చగ ఎముకల గూడు నీ పేరేగా చెబుతుంది..

చిటచిటమని చిందేస్తావా.. వదులొదులని విదిలిస్తావా
దడదడమని జడిపిస్తావా... ఒంటరిగా వదిలేస్తావా

pallavi:

idi raṇaraṁgamā lega agni guṁḍamā
vidhi naḍibe prema ardhamavade.......
idi raṇaraṁgamā lega agni guṁḍamā
vidhi naḍibe prema ardhamavade

saraṇaṁ 1:

agni kaṇamu.. nīḍi guṇamu.. rĕṁṭini kalibide nuvvenā...
ivadali vaibu devadavaide avadali vaibu dĕyyamuvā
samayaṁ tiṁṭāv.. mĕdaḍuni tiṁṭāv
nanne tiṁṭāv tappu kādā..
pani pāḍa leni pillā iṁṭlo nīgu tiṁḍi ledā..
sūbulu tagalaga... māḍalu pĕgalaga..
urumulu mĕrubulu āraṁbhaṁ..
pādaṁ.. keśhaṁ.. nābhi.. kamalaṁ ragulugŏnagā ānaṁdaṁ
dhaga dhagamani vĕligĕnu jvāla... sĕga sĕgamani ĕgirĕnu bālā
tahadahamani tabanala gola ...kasi kasiyani kaugili elā

saraṇaṁ 2:

mitrula bṛṁdaṁ ĕdure vaste pakkagi tŏlagi naḍisidini
pŏddunna ninnu sūstānaṁṭū rātrinaṁtā gaḍibidini...
iṭṭā iṭṭā rojulu gaḍabaga iṁkā nanneṁ sestāvu...
māyā maṁtraṁ tĕlisina dānā tvaragā nannu saṁpĕdavā...
e tāḍainā nī talabulni bigiselāga kaḍuduṁdā..
nanne kālsaga ĕmugala gūḍu nī peregā sĕbuduṁdi..

siḍasiḍamani siṁdestāvā.. vadulŏdulani vidilistāvā
daḍadaḍamani jaḍibistāvā... ŏṁṭarigā vadilestāvā