Ichchugo muddichchi puchchugo

ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో
Year
Language

పల్లవి:

ఇచ్చుకో ..ముద్దిచ్చి పుచ్చుకో
ముత్యమంత ముద్దు ఇచ్చుకో .. ముద్దబంతి లాగ విచ్చుకో
ఇచ్చుకో.. ముద్దిచ్చి పుచ్చుకో
ముత్యమంత ముద్దు ఇచ్చుకో .. ముద్దబంతి పూలు దోచుకో
సంగతేమిటో .. దొంగలించుకో .. బెంగ ఎందుకో !

ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో .. ముత్యమంత ముద్దు ఇచ్చుకో .. ముద్దబంతి లాగ విచ్చుకో

చరణం 1:

నీ కన్నూ గీటినప్పుడే సిరివెన్నెలాయే
నీ గాలీ సోకినప్పుడే సన్నజాజీ పూసే .. విరబూసే
చిరుముద్దూ పెట్టినప్పుడే సిరిమువ్వా మోగే
నీ చేయీ తాకినప్పుడే జడకొంగూ జారే .. చలితీరేచిలిపి వలపు చిలక పలికితేకలికి చిలక అలక తీరదా
పెదవి పెదవి అదిమినంతనే
మరుల మధువు పొరలి పొంగనీ నాలో... వసంతమే ఊరేగీ వచ్చేటీ వయసులలో !
ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో .. ముత్యమంత ముద్దు ఇచ్చుకో .. ముద్దబంతి లాగ విచ్చుకో

చరణం 2:

నీ లేఖా అందినప్పుడే మొదలాయే మోహం
నీ రేఖా దాటినప్పుడే శృతిమించే దాహం .. నీ స్నేహం
నీ జంటా చేరినప్పుడే బ్రతుకాయే బంధం
నీ ఒళ్ళో వాలినప్పుడే దొరికిందీ స్వర్గం .. నీ సర్వం
కనులు కలిసి కలలు మరిగితి
వెలుగు తగిలి వలపు పండగా
తనువు తనువు అదుపు తప్పితే
మనసులడుగు మనువుజరిగెనే నాలో... సరాగమే సంగీత గంధాలూ చిలకగనే !

ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో .. ముత్యమంత ముద్దు ఇచ్చుకో .. ముద్దబంతి లాగ విచ్చుకో

pallavi:

ichchugo ..muddichchi puchchugo
mutyamaṁta muddu ichchugo .. muddabaṁti lāga vichchugo
ichchugo.. muddichchi puchchugo
mutyamaṁta muddu ichchugo .. muddabaṁti pūlu dosugo
saṁgademiḍo .. dŏṁgaliṁchugo .. bĕṁga ĕṁdugo !

ichchugo muddichchi puchchugo .. mutyamaṁta muddu ichchugo .. muddabaṁti lāga vichchugo

saraṇaṁ 1:

nī kannū gīḍinappuḍe sirivĕnnĕlāye
nī gālī soginappuḍe sannajājī pūse .. virabūse
sirumuddū pĕṭṭinappuḍe sirimuvvā moge
nī seyī tāginappuḍe jaḍagŏṁgū jāre .. salidīresilibi valabu silaga paligidegaligi silaga alaga tīradā
pĕdavi pĕdavi adiminaṁtane
marula madhuvu pŏrali pŏṁganī nālo... vasaṁtame ūregī vachcheḍī vayasulalo !
ichchugo muddichchi puchchugo .. mutyamaṁta muddu ichchugo .. muddabaṁti lāga vichchugo

saraṇaṁ 2:

nī lekhā aṁdinappuḍe mŏdalāye mohaṁ
nī rekhā dāḍinappuḍe śhṛtimiṁche dāhaṁ .. nī snehaṁ
nī jaṁṭā serinappuḍe bradugāye baṁdhaṁ
nī ŏḽḽo vālinappuḍe dŏrigiṁdī svargaṁ .. nī sarvaṁ
kanulu kalisi kalalu marigidi
vĕlugu tagili valabu paṁḍagā
tanuvu tanuvu adubu tappide
manasulaḍugu manuvujarigĕne nālo... sarāgame saṁgīda gaṁdhālū silagagane !

ichchugo muddichchi puchchugo .. mutyamaṁta muddu ichchugo .. muddabaṁti lāga vichchugo