Title (Indic)ఔనని అంటావో మరి కాదని అంటావో WorkHoli Year2002 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer R. P. Patnaik LyricsTeluguపల్లవి: ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమౌతోందీ నా మనసెంతో అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఔనని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో చరణం 1: చిగురాకుల లేఖలు రాసి చిరుగాలి చేతికి ఇచ్చి ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా నా మనసే పడవగ చేసి కలలన్ని అలలుగ చేసి ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా చెప్పాలని అనిపిస్తున్న నా ఎదుటే నువ్ కూర్చున్న మనసులొన మాట నీకు చెప్పలేక పొతున్నా చెప్పకుండ ఓ క్షణమైన వుండలేక పొతున్న ఎలా చెప్పనమ్మ నాలొని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమ నువ్వని చరణం 2: ప్రేమన్నది ఊపిరి కాదా అందరిలో ఉండేదేగా పరిచయమే లేదని అంటే వింతే కదా నువ్వున్నది నాలోనేగా ఈ సంగతి విననే లేదా మదిలోనే నువ్ నిదరోతూ గమనించలేదా ఎదనిండా ఆశలు ఉన్నా ఎన్నెన్నో ఊసులు ఉన్నా ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా కళ్ళలోకి చూసి అయినా పోల్చూకోవా నా ప్రేమ ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని Englishpallavi: aunani aṁṭāvo mari kādani aṁṭāvo emaṁṭāvo emonanna saṁdehaṁto emani sĕppālo nīgemani sĕppālo tĕliyaga sadamadamaudoṁdī nā manasĕṁto aḍo iḍo ĕḍo mari telani nimiṣhaṁlo ĕlā sĕppanammā nāloni premani ĕlā sūbanammā nā prema nuvvani aunani aṁṭāvo mari kādani aṁṭāvo emaṁṭāvo emonanna saṁdehaṁto saraṇaṁ 1: sigurāgula lekhalu rāsi sirugāli sedigi ichchi ĕbuḍo ne paṁpiṁchānu nuvvu sūḍaledā nā manase paḍavaga sesi kalalanni alaluga sesi ĕbuḍo ne paṁpiṁchānu ninnu seraledā sĕppālani anibistunna nā ĕduḍe nuv kūrsunna manasulŏna māḍa nīgu sĕppalega pŏdunnā sĕppaguṁḍa o kṣhaṇamaina vuṁḍalega pŏdunna ĕlā sĕppanamma nālŏni premani ĕlā sūbanamma nā prema nuvvani saraṇaṁ 2: premannadi ūbiri kādā aṁdarilo uṁḍedegā parisayame ledani aṁṭe viṁte kadā nuvvunnadi nālonegā ī saṁgadi vinane ledā madilone nuv nidarodū gamaniṁchaledā ĕdaniṁḍā āśhalu unnā ĕnnĕnno ūsulu unnā prema bhāṣha rādu aṁṭe nammavā o mainā kaḽḽalogi sūsi ayinā polsūgovā nā prema ĕlā sĕppanammā nāloni premani ĕlā sūbanammā nā prema nuvvani