Haayi haayi .. emta haayi

హాయి హాయి .. ఎంత హాయి
Year
Language

పల్లవి:

హాయి హాయి .. ఎంత హాయి .. ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి
మల్లెలాంటి మనసు పొంగేనులే ... ఆహాఁ..అల్లిబిల్లి ఊసులాడే
హేహే..పెద్దబస్తీల గోరింక మావంక తిరిగే
చిలక ఏమన్నది ? చేర రమ్మన్నది ...
స్నేహాలు ... మోహాలు .. గోరింక సొమ్మన్నది
హాయి హాయి .. ఎంత హాయి .. ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి

చరణం 1:

ఏ..ఆనాడు చేసేవు బాస..అనుబంధాల పెంచేవు ఆశ
ఇక ఈనాడు.. ఏనాడు ..నాతోడు ..నాజోడు.. ఓ రాజా నావాడు నీవే ...

హేహే..నీతోనే ఉంటాను..నీలోనే ఉంటాను
నిగనిగ సొగసుల నిలిచెదను...
ఈ లోకమేమనుకోనీ ..ఎదలో ..ఓ..మెదిలే వెలిగే ..వలపు నేనే ...

హాయి హాయి .. ఎంత హాయి .. ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి

చరణం 2:

హేహే..దోబూచులాడెను సొగసు ..నను ఊరించసాగెను వయసు
ఇక నీ ఇంపు.. నీ సొంపు.. నీ నీటు..నీ గోటు రాగాలు భోగాలు నావే ..

హేహే..నా నోము పండేను .. నీ మోజు తీరెను..
నవ్వుల పువ్వులు మన కలలు..
ఈ లోకమేమనుకోనీ .. ఇలలో కలలో ఎడమే మనకు లేదు ...

హాయి హాయి .. ఎంత హాయి .. ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి
మల్లెలాంటి మనసు పొంగేనులే ... ఆహాఁ..అల్లిబిల్లి ఊసులాడే...
హేహే..పెద్దబస్తీల గోరింక మావంక తిరిగే
చిలక ఏమన్నది ? చేర రమ్మన్నది ...
స్నేహాలు ... మోహాలు .. గోరింక సొమ్మన్నది
హాయి హాయి .. ఎంత హాయి .. ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి

pallavi:

hāyi hāyi .. ĕṁta hāyi .. muddu muchchaṭlu muribiṁchĕnoyi
mallĕlāṁṭi manasu pŏṁgenule ... āhām̐..allibilli ūsulāḍe
hehe..pĕddabastīla goriṁka māvaṁka tirige
silaga emannadi ? sera rammannadi ...
snehālu ... mohālu .. goriṁka sŏmmannadi
hāyi hāyi .. ĕṁta hāyi .. muddu muchchaṭlu muribiṁchĕnoyi

saraṇaṁ 1:

e..ānāḍu sesevu bāsa..anubaṁdhāla pĕṁchevu āśha
iga īnāḍu.. enāḍu ..nādoḍu ..nājoḍu.. o rājā nāvāḍu nīve ...

hehe..nīdone uṁṭānu..nīlone uṁṭānu
niganiga sŏgasula nilisĕdanu...
ī logamemanugonī ..ĕdalo ..o..mĕdile vĕlige ..valabu nene ...

hāyi hāyi .. ĕṁta hāyi .. muddu muchchaṭlu muribiṁchĕnoyi

saraṇaṁ 2:

hehe..dobūsulāḍĕnu sŏgasu ..nanu ūriṁchasāgĕnu vayasu
iga nī iṁpu.. nī sŏṁpu.. nī nīḍu..nī goḍu rāgālu bhogālu nāve ..

hehe..nā nomu paṁḍenu .. nī moju tīrĕnu..
navvula puvvulu mana kalalu..
ī logamemanugonī .. ilalo kalalo ĕḍame managu ledu ...

hāyi hāyi .. ĕṁta hāyi .. muddu muchchaṭlu muribiṁchĕnoyi
mallĕlāṁṭi manasu pŏṁgenule ... āhām̐..allibilli ūsulāḍe...
hehe..pĕddabastīla goriṁka māvaṁka tirige
silaga emannadi ? sera rammannadi ...
snehālu ... mohālu .. goriṁka sŏmmannadi
hāyi hāyi .. ĕṁta hāyi .. muddu muchchaṭlu muribiṁchĕnoyi