గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
పల్లవి:
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట
ఆడుకోవాలి గువ్వలాగ .. పాడుకుంటాను నీ జంట గోరింకనై
చరణం 1:
జోడుకోసం గోడదూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యొపాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయిగారు
ఆత్రమూ.. ఆరాటమూ .. చిందే వ్యామోహం
ఊర్పులో .. నిట్టూర్పులో.. అంతా నీధ్యానం
కోరుకున్నానని ఆట పట్టించకు
చేరుకున్నానని నన్ను దోచేయకు
చుట్టుకుంటాను సుడిగాలిలా ...!!
చరణం 2:
కొండనాగు తోడుచేరి నాగిణి బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం
పువ్వులో .. మకరందము .. ఉందే నీకోసం
తీర్చుకో .. ఆ దాహము .. వలపే జలపాతం
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వమూ ... !!
pallavi:
guvva goriṁkado āḍiṁdile bŏmmalāḍa
niṁḍu nāguṁḍĕlo mrogiṁdile vīṇabāḍa
āḍugovāli guvvalāga .. pāḍuguṁṭānu nī jaṁṭa goriṁkanai
saraṇaṁ 1:
joḍugosaṁ goḍadūge vayasidi tĕlusugo ammāyigāru
ayyŏbābaṁ aṁta tābaṁ tagadule tamarigi abbāyigāru
ātramū.. ārāḍamū .. siṁde vyāmohaṁ
ūrbulo .. niṭṭūrbulo.. aṁtā nīdhyānaṁ
korugunnānani āḍa paṭṭiṁchagu
serugunnānani nannu doseyagu
suṭṭuguṁṭānu suḍigālilā ...!!
saraṇaṁ 2:
kŏṁḍanāgu toḍuseri nāgiṇi busalalo vachche saṁgīdaṁ
saṁdĕgāḍa aṁdagattĕ pŏṁdulo uṁdile ĕṁto saṁtoṣhaṁ
puvvulo .. magaraṁdamu .. uṁde nīgosaṁ
tīrsugo .. ā dāhamu .. valabe jalabādaṁ
kŏṁchĕmāgālile korgĕ tīreṁdugu
dūramuṁṭānule daggarayyeṁdugu
dāsibĕḍadānu nā sarvamū ... !!