పల్లవి:
గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది
ఓ.. గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది
ఓ..గుడిలోన జేగంట మ్రోగింది నా గుండెలో తొలివలపు పండింది (2)
ఓ.. గుండెలో తొలివలపు పండింది
చరణం 1:
నల్లా నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది
తనువు సెలరేఖలై వెలిగింది (2)
చల్లా చల్లాని జల్లు కురిసింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది
చరణం 2:
కొమ్మ మీదా వాలి గోరింకా కమ్మ కమ్మని ఊసులాడింది
గోరింక తానింక గూడు కట్టకపోతే (2)
కొమ్మా యెంతో చిన్న బోతుంది (2)
ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది
చరణం 3:
సన్నగాజుల రవళి పిలిచింది సన్నజాజుల దండ వేసింది (2)
మనసైన జవరాలే వలచింది (2)
మనుగడే ఒక మలుపు తిరిగింది (2)
ఊ...ఊ
pallavi:
guṭṭamīda guvva kūsiṁdi kaṭṭamīda kaṁju paligiṁdi
o.. guṭṭamīda guvva kūsiṁdi kaṭṭamīda kaṁju paligiṁdi
o..guḍilona jegaṁṭa mrogiṁdi nā guṁḍĕlo tŏlivalabu paṁḍiṁdi (2)
o.. guṁḍĕlo tŏlivalabu paṁḍiṁdi
saraṇaṁ 1:
nallā nallāni mabbu naḍisiṁdi tĕllā tĕllāni aṁchu tosiṁdi
tanuvu sĕlarekhalai vĕligiṁdi (2)
sallā sallāni jallu kurisiṁdi
o..guṭṭamīda guvva kūsiṁdi
nā guṁḍĕlo tŏlivalabu paṁḍiṁdi
o..guṭṭamīda guvva kūsiṁdi
saraṇaṁ 2:
kŏmma mīdā vāli goriṁkā kamma kammani ūsulāḍiṁdi
goriṁka tāniṁka gūḍu kaṭṭagabode (2)
kŏmmā yĕṁto sinna boduṁdi (2)
o..guṭṭamīda guvva kūsiṁdi
nā guṁḍĕlo tŏlivalabu paṁḍiṁdi
o..guṭṭamīda guvva kūsiṁdi
saraṇaṁ 3:
sannagājula ravaḽi pilisiṁdi sannajājula daṁḍa vesiṁdi (2)
manasaina javarāle valasiṁdi (2)
manugaḍe ŏga malubu tirigiṁdi (2)
ū...ū