పల్లవి:
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండ సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామ ప్రేమా.. ఆ ఆ ఆ...
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
చరణం 1:
చూస్తునే మనసు వెళ్ళీ నీ ఒళ్ళో వాలగ
నిలువెల్లా మారిపోయానే నీ నీడగ
నిలవదు నిమిషం నువ్వు ఎదురుంటే
కదలదు సమయం కనబడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేసావమ్మ
కవ్విస్తూనే చంద్రజాలం వేసావమ్మ
పరిచయమే చేసావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా.. ఆ ఆ ఆ....
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
చరణం 2:
నీ పేరే పలవరించే నాలో నీ ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఏన్నెన్నెన్నో గాధలున్న నీ భాషని
ఉన్నటుండి నేర్పినావు ఈ రోజుని
నీ జతలో క్షణమైన బ్రతుకును చరితగ మార్చేస్తుందమ్మా.. ఆ ఆ ఆ...
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామ ప్రేమా..ఆ ఆ ఆ....
pallavi:
guṁḍĕ niṁḍā guḍi gaṁṭalu guvvala gŏṁtulu ĕnno mroguduṁṭe
kaḽḽa niṁḍa saṁkrāṁtulu saṁdhyā kāṁtulu śhubhāgāṁkṣhalaṁṭe
vĕṁṭane polsānu nī sirunāma premā.. ā ā ā...
guṁḍĕ niṁḍā guḍi gaṁṭalu guvvala gŏṁtulu ĕnno mroguduṁṭe
kaḽḽa niṁḍā saṁkrāṁtulu saṁdhyā kāṁtulu śhubhāgāṁkṣhalaṁṭe
saraṇaṁ 1:
sūstune manasu vĕḽḽī nī ŏḽḽo vālaga
niluvĕllā māriboyāne nī nīḍaga
nilavadu nimiṣhaṁ nuvvu ĕduruṁṭe
kadaladu samayaṁ kanabaḍaguṁṭe
nuvvŏstūne iṁdrajālaṁ sesāvamma
kavvistūne saṁdrajālaṁ vesāvamma
parisayame sesāve nanne nāgu kŏttaga o premā.. ā ā ā....
guṁḍĕ niṁḍā guḍi gaṁṭalu guvvala gŏṁtulu ĕnno mroguduṁṭe
kaḽḽa niṁḍā saṁkrāṁtulu saṁdhyā kāṁtulu śhubhāgāṁkṣhalaṁṭe
saraṇaṁ 2:
nī pere palavariṁche nālo nī āśhalu
maunānne āśhrayiṁche ĕnnĕnno ūsulu
tĕrisina kanule kalalagu nĕlavai
kadalani pĕdave kavidalu sadive
ennĕnnĕnno gādhalunna nī bhāṣhani
unnaḍuṁḍi nerbināvu ī rojuni
nī jadalo kṣhaṇamaina bradugunu saridaga mārsestuṁdammā.. ā ā ā...
guṁḍĕ niṁḍā guḍi gaṁṭalu guvvala gŏṁtulu ĕnno mroguduṁṭe
kaḽḽa niṁḍā saṁkrāṁtulu saṁdhyā kāṁtulu śhubhāgāṁkṣhalaṁṭe
vĕṁṭane polsānu nī sirunāma premā..ā ā ā....