Gudivaadaa ellaanu

గుడివాడా ఎల్లాను
Work
Year
Language

పల్లవి:

గుడివాడ ఎల్లాను... గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను... గుంటూరు పొయ్యాను
ఏలూరు.. నెల్లూరు.. ఎన్నెన్నో చూసాను
యాడ చూసినా.. ఎంత చేసినా.. ఏదో కావలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను

చరణం 1:

కమ్మని పాట చక్కని ఆట
కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా హా కొందరు నన్ను
పాడమంటారు పచ్చిగ ఆడమంటారు
నచ్చానంటే జై కొడతారు
నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చి గా పైపడతారు
దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్ళు యమ ఫోజు గాళ్ళు
ఓయబ్బో పోకిరోళ్ళు యమ ఫోజు గాళ్ళు

గుడివాడ ఎల్లాను.. గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను.. గుంటూరు పొయ్యాను
చిత్తూరు.. పుత్తూరు.. ఎన్నెన్నో చూసాను

చరణం 2:

బందరులోనా అందరిలోనా
రంభవి అన్నాడు ఒకడు రావే అన్నాడూ
వైజాగు బాబు చేసాడు డాబు
రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయే
తిరపతిలోనా పరపతిపోయే
అందరిమెప్పు పొందాలంటే
దేవుడికైనా తరం కాదు
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బబ్బ గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

గుడివాడ ఎల్లాను.. గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను.. గుంటూరు పొయ్యాను
ఒంగోలు.. వరంగల్లు.. ఎన్నెన్నో చూసాను

యాడ చూసినా ఎంత చేసినా ఏదో కావలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళ్

pallavi:

guḍivāḍa ĕllānu... guṁṭūru pŏyyānu
guḍivāḍa ĕllānu... guṁṭūru pŏyyānu
elūru.. nĕllūru.. ĕnnĕnno sūsānu
yāḍa sūsinā.. ĕṁta sesinā.. edo kāvalaṁṭāru
sachchinoḽḽu āḍagu vachchinoḽḽu
abbabbabbabba sachchinoḽḽu āḍagu vachchinoḽḽu

guḍivāḍa ĕllānu guṁṭūru pŏyyānu

saraṇaṁ 1:

kammani pāḍa sakkani āḍa
kāvālaṁṭāru kŏṁdaru buddiga uṁṭāru
kasi kasigā hā kŏṁdaru nannu
pāḍamaṁṭāru pachchiga āḍamaṁṭāru
nachchānaṁṭe jai kŏḍadāru
nachchagabode sī kŏḍadāru
pichchi pichchi gā paibaḍadāru
dummu kāstā dulibestāru
pogiroḽḽu yama phoju gāḽḽu
oyabbo pogiroḽḽu yama phoju gāḽḽu

guḍivāḍa ĕllānu.. guṁṭūru pŏyyānu
guḍivāḍa ĕllānu.. guṁṭūru pŏyyānu
sittūru.. puttūru.. ĕnnĕnno sūsānu

saraṇaṁ 2:

baṁdarulonā aṁdarilonā
raṁbhavi annāḍu ŏgaḍu rāve annāḍū
vaijāgu bābu sesāḍu ḍābu
reḍĕṁtannāḍu āḍagu reḍĕṁtannāḍu
kāgināḍalo gallaṁtāye
tirabadilonā parabadiboye
aṁdarimĕppu pŏṁdālaṁṭe
devuḍigainā taraṁ kādu
ā yamuḍigainā taraṁ kādu
gaṭṭivāḽḽu āḍagu vachchinoḽḽu
abbabbabbabba gaṭṭivāḽḽu āḍagu vachchinoḽḽu

guḍivāḍa ĕllānu.. guṁṭūru pŏyyānu
guḍivāḍa ĕllānu.. guṁṭūru pŏyyānu
ŏṁgolu.. varaṁgallu.. ĕnnĕnno sūsānu

yāḍa sūsinā ĕṁta sesinā edo kāvalaṁṭāru
sachchinoḽḽu āḍagu vachchinoḽḽu
abbabbabbabba sachchinoḽḽu āḍagu vachchinoḽḽ