Gudilo emumdee baaboo badilone umdee

గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ
Year
Language

పల్లవి:

జై శ్రీమద్రమారమణ గోవిందో హా...నాయనలారా
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ
భక్తి ముక్తి కావాలంటే మాధవ సేవా చెయ్యాలంటే !బడిలో!

గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ
భుక్తి శక్తి కావాలంటే మానవ సేవా చెయ్యాలంటే

చరణం 1:

దేవుడి పేరిట దోపిడి చేసే దళారులెందరొ పెరిగారు
ముక్తి మత్తులో భక్తుల ముంచి సర్వం భొంచేస్తున్నారు
నోరులేని ఆ దేవుడు పాపం నీరు గారి పోతున్నాడు...అయ్యో..!గుడిలో!

చదువుల పేరిట గుమాస్తాలను తయారు చేస్తూ ఉన్నారు
ప్రభువుల్లాగ బ్రతికేవాళ్ళను బానిసలుగ చేస్తున్నారు
ఉద్యోగాలకు వేటలాడమని ఊళ్ళపైకి తోలేస్తున్నారు !బడిలో!

చరణం 2:

చదవకపోతే మనిషి రివ్వున చంద్రుడి పైకి ఎగిరేవాడా
గిర గిర తిరిగి వచ్చేవాడా
దేవుడు చల్లగ చూడకపోతే అక్కడ గల్లంతైపోడా
ఆనవాలు చిక్కేవాడా !గుడిలో! !బడిలో!

చరణం 3:

చదువులుసారం హరి యని.. హరి కూడా చదవాలని
చదువులమర్మం హరి యని.. ఆ హరి కీ గురువుండాలని
హరియే సర్వసమ్మని.....చదువే సర్వసమ్మని
హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్ల గుద్ది చెప్పాడు

ఆ హరియే శ్రీకృష్ణుడుగా వచ్చి బడిలో కూర్చొని చదివాడు
ఈ బడిలో కూర్చొని చదివాడు చదివాడు చదివాడు చదివాడు
చదివాడు చదివాడు

pallavi:

jai śhrīmadramāramaṇa goviṁdo hā...nāyanalārā
baḍilo emuṁdī devuni guḍilone uṁdī
bhakti mukti kāvālaṁṭe mādhava sevā sĕyyālaṁṭe !baḍilo!

guḍilo emuṁdī bābū baḍilone uṁdī
bhukti śhakti kāvālaṁṭe mānava sevā sĕyyālaṁṭe

saraṇaṁ 1:

devuḍi periḍa dobiḍi sese daḽārulĕṁdarŏ pĕrigāru
mukti mattulo bhaktula muṁchi sarvaṁ bhŏṁchestunnāru
noruleni ā devuḍu pābaṁ nīru gāri podunnāḍu...ayyo..!guḍilo!

saduvula periḍa gumāstālanu tayāru sestū unnāru
prabhuvullāga bradigevāḽḽanu bānisaluga sestunnāru
udyogālagu veḍalāḍamani ūḽḽabaigi tolestunnāru !baḍilo!

saraṇaṁ 2:

sadavagabode maniṣhi rivvuna saṁdruḍi paigi ĕgirevāḍā
gira gira tirigi vachchevāḍā
devuḍu sallaga sūḍagabode akkaḍa gallaṁtaiboḍā
ānavālu sikkevāḍā !guḍilo! !baḍilo!

saraṇaṁ 3:

saduvulusāraṁ hari yani.. hari kūḍā sadavālani
saduvulamarmaṁ hari yani.. ā hari kī guruvuṁḍālani
hariye sarvasammani.....saduve sarvasammani
haribhaktuḍu prahlāduḍu munube balla guddi sĕppāḍu

ā hariye śhrīkṛṣhṇuḍugā vachchi baḍilo kūrsŏni sadivāḍu
ī baḍilo kūrsŏni sadivāḍu sadivāḍu sadivāḍu sadivāḍu
sadivāḍu sadivāḍu