గోరొంకగూటికే చేరావు చిలకా
పల్లవి:
గోరొంకగూటికే చేరావు చిలకా
గోరొంకగూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారుమొలకా
గోరొంకగూటికే చేరావు చిలకా
చరణం 1:
ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు
అలసివుంటావు మనసు చెదరివుంటావు ||2||
మా మల్లెపూలు నీకు మంచికథలు చెప్పునే ||2||
ఆదమరిచి ఈ రేయి హాయిగా నిదురపో
చరణం 2:
నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయీ, అబ్బ! ఉండన్నాయీ ||2||
పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి ||2||
పలుకైనా పలుకవా బంగారు చిలకా || గోరొంక ||
pallavi:
gorŏṁkagūḍige serāvu silagā
gorŏṁkagūḍige serāvu silagā
bhayamĕṁduge nīgu baṁgārumŏlagā
gorŏṁkagūḍige serāvu silagā
saraṇaṁ 1:
e sīmadānavo ĕgirĕgiri vŏchchāvu
alasivuṁṭāvu manasu sĕdarivuṁṭāvu ||2||
mā mallĕbūlu nīgu maṁchigathalu sĕppune ||2||
ādamarisi ī reyi hāyigā nidurabo
saraṇaṁ 2:
nilavaleni kaḽḽu nidarabŏmmannāyi
dāgani sirunavvulu vaddannāyī, abba! uṁḍannāyī ||2||
paiḍasĕṁgu rĕbarĕbalu padabada lĕmmannāyi ||2||
palugainā palugavā baṁgāru silagā || gorŏṁka ||