గోరింట పూచింది కొమ్మలేకుండా...
పల్లవి:
గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది ||2||
ఎంచక్కా పండిన ఎర్రని చుక్క
చిట్టీపేరంటానికి కలకాలం రక్ష
చరణం 1:
మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు ||2||
సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోన
చరణం 2:
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు ||2||
సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామ అతనే దిగివస్తాడు
చరణం 3:
పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు
పాపిష్టి కళ్ళల్లో పచ్చాకామెర్లు
కోపిష్టి కళ్ళల్లో కొరివిమంటల్లు
pallavi:
goriṁṭa pūsiṁdi kŏmmaleguṁḍā
muribāla araseda mŏgga tŏḍigiṁdi ||2||
ĕṁchakkā paṁḍina ĕrrani sukka
siṭṭīberaṁṭānigi kalagālaṁ rakṣha
saraṇaṁ 1:
māmiḍī sigurĕrubu maṁkĕna puvvĕrubu
maṇulanniṁṭilona māṇikyaṁ ĕrubu ||2||
saṁde vannĕllona sāge mabbĕrubu
tānĕrubu ammāyi tanavārilona
saraṇaṁ 2:
maṁdāraṁlā pūste maṁchi mŏguḍŏstāḍu
gannerulā pūste kalavāḍŏstāḍu ||2||
siṁdhūraṁlā pūste siṭṭi seyaṁtā
aṁdāla saṁdamāma adane digivastāḍu
saraṇaṁ 3:
paḍagūḍadammā pābāyi mīda
pābiṣhṭi kaḽḽu kobiṣhṭi kaḽḽu
pābiṣhṭi kaḽḽallo pachchāgāmĕrlu
kobiṣhṭi kaḽḽallo kŏrivimaṁṭallu