Gogulu poose gogulu kaase ...

గోగులు పూచే గోగులు కాచే ...
Work
Year
Language

పల్లవి:

గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి
గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి
పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మాడి
పుత్తడి వెలుగులు ఉ.ఉ.ఉహు..ఓ లచ్చా గుమ్మాడి

అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే
అమ్మాయికే అర్ధానివే మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దోచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చోచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటూ నా చేయీ ఒట్టేసెందుకే ఉంది
చెలీ చూడు నా చెవా చుట్టేసేందుకే ఉంది

ముద్దోచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చోచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే...

చరణం 1:

నువ్వు పిలిచెందుకే నాకు పేరున్నదీ
నిన్ను పిలిచెందుకే నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ
ఒక్కటైయెందుకే ఇద్దరం ఉన్నదీ

నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవి
నీ శ్వాసగా మారెందుకే ఆ పూల గంధాల గాలున్నవి

చరణం 2:

వేల వేల వేల వేల ఉప్పెన నేనై వస్తా
నే కళ కళ కళ కళ మోముని చూస్తూ ఉంటా
గల గల గల గల మువ్వని నేనై వస్తా
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా

కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాకా కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా ||2||

నీ కోటగా మారెందుకే నా గుండె చాటుల్లో చోటున్నది
నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది

అలా అంటూ నా చేయీ ఒట్టేసెందుకే ఉంది
చెలీ చూడు నా చెవా చుట్టేసేందుకే ఉంది

pallavi:

gogulu pūse gogulu kāse o lachchā gummāḍi
gogulu pūse gogulu kāse o lachchā gummāḍi
pŏddu pŏḍise pŏddu pŏḍise o lachchā gummāḍi
puttaḍi vĕlugulu u.u.uhu..o lachchā gummāḍi

aṁdānige addānive kaṭṭunna bŏṭṭunna godārive
ammāyige ardhānive māḍunna manasunna mutyānive
muddochchinā goriṁṭave kaṭṭunna bŏṭṭunna godārive
achchochchinā jābillive māḍunna manasunna mutyānive
alā aṁṭū nā seyī ŏṭṭesĕṁduge uṁdi
sĕlī sūḍu nā sĕvā suṭṭeseṁduge uṁdi

muddochchinā goriṁṭave kaṭṭunna bŏṭṭunna godārive
achchochchinā jābillive māḍunna manasunna mutyānive...

saraṇaṁ 1:

nuvvu pilisĕṁduge nāgu perunnadī
ninnu pilisĕṁduge nāgu pilubunnadī
ninnu gĕliseṁduge nāgu pŏgarunnadī
ŏkkaḍaiyĕṁduge iddaraṁ unnadī

nī pūjagai vachcheṁduge vevela varṇāla pūlunnavi
nī śhvāsagā mārĕṁduge ā pūla gaṁdhāla gālunnavi

saraṇaṁ 2:

vela vela vela vela uppĕna nenai vastā
ne kaḽa kaḽa kaḽa kaḽa momuni sūstū uṁṭā
gala gala gala gala muvvani nenai vastā
nī aḍugaḍugaḍuguna kāvali kāstū uṁṭā

kastūrilā māri nī nuduḍane seri kaḍadāgā kalisuṁḍanā
kannīrulā māri nī sĕṁpabai jāri kaladalni karigiṁchanā ||2||

nī koḍagā mārĕṁduge nā guṁḍĕ sāḍullo soḍunnadi
nī vāḍigā uṁḍeṁduge ī niṁḍu nūreḽḽa janmunnadi

alā aṁṭū nā seyī ŏṭṭesĕṁduge uṁdi
sĕlī sūḍu nā sĕvā suṭṭeseṁduge uṁdi