Godaaree gattuganna

గోదారీ గట్టుకన్న
Year
Language

పల్లవి:

గోదారీ గట్టుకన్న
వయ్యారీ చీర కట్టు
పదిలంగా ఉందిలే అమ్మడు
వరదల్లే వాటేస్తా
తరగల్లే దాటేస్తా
ఏం చేస్తావో చూస్తా అప్పుడు
చందమామా మచ్చకన్న
సన్నాయి మీస కట్టు
సరదాగా ఉందిలే పిల్లడు
సరసంగా దువ్వేస్తా
సరసకోచ్చి కవ్విస్తా
ఏం చేస్తావొ చూస్తా అప్పుడు

చరణం 1:

ఏటి గాలి కోడుతుంటే
పైట ఎగిరి పడుతుంటే
కన్నెతనం కసి కసిగా
కాస్త బయట పడుతుంటే
నువ్వు దగ్గరౌతుంటే
ఈడు సిగ్గు పడుతుంటే
కంటి రెప్ప కసి కసిగా
జంట జంట పుడుతుంటే
మనసంతా చోటిస్తా
మల్లెల్లో ముంచేస్తా
ఏం చెస్తావొ చూస్తా అప్పుడు
ఓ..చేసెదో చెసేయి ఇప్పుడు
గోదారీ గట్టుకన్న
వయ్యారీ చీర కట్టు

చరణం 2:

పడుచు ఎండ పడుతుంటే
లేత చెమట పుడుతుంటే
తుడుచుకోనే కడ కొంగే
వడిచి నువ్వు పడుతుంటే
నీరు ముందుకోస్తుంటే
నారు ముద్దు పెడుతుంటే
పైరంతా ఎదిగి ఎదిగి
పంట చేతి కోస్తుంటే
మాటలన్ని దాచేసి
చేతలేవో చేసేస్తే
అసలు రుచులు చూపిస్తా అప్పుడు
అప్పుడంటే ఎప్పుడు ఇంకెఫ్ఫుడు
చందమామ మచ్చకన్న
సన్నాయి మీసకట్టు
వరదల్లె వాటేస్తా
తరగల్లే దాటేస్తా
ఏం చెస్తావో చూస్తా అప్పుడు
అప్పుడంటే ఎప్పుడు ఇంకెప్పుడు

pallavi:

godārī gaṭṭuganna
vayyārī sīra kaṭṭu
padilaṁgā uṁdile ammaḍu
varadalle vāḍestā
taragalle dāḍestā
eṁ sestāvo sūstā appuḍu
saṁdamāmā machchaganna
sannāyi mīsa kaṭṭu
saradāgā uṁdile pillaḍu
sarasaṁgā duvvestā
sarasagochchi kavvistā
eṁ sestāvŏ sūstā appuḍu

saraṇaṁ 1:

eḍi gāli koḍuduṁṭe
paiḍa ĕgiri paḍuduṁṭe
kannĕdanaṁ kasi kasigā
kāsta bayaḍa paḍuduṁṭe
nuvvu daggarauduṁṭe
īḍu siggu paḍuduṁṭe
kaṁṭi rĕppa kasi kasigā
jaṁṭa jaṁṭa puḍuduṁṭe
manasaṁtā soḍistā
mallĕllo muṁchestā
eṁ sĕstāvŏ sūstā appuḍu
o..sesĕdo sĕseyi ippuḍu
godārī gaṭṭuganna
vayyārī sīra kaṭṭu

saraṇaṁ 2:

paḍusu ĕṁḍa paḍuduṁṭe
leda sĕmaḍa puḍuduṁṭe
tuḍusugone kaḍa kŏṁge
vaḍisi nuvvu paḍuduṁṭe
nīru muṁdugostuṁṭe
nāru muddu pĕḍuduṁṭe
pairaṁtā ĕdigi ĕdigi
paṁṭa sedi kostuṁṭe
māḍalanni dāsesi
sedalevo seseste
asalu rusulu sūbistā appuḍu
appuḍaṁṭe ĕppuḍu iṁkĕphphuḍu
saṁdamāma machchaganna
sannāyi mīsagaṭṭu
varadallĕ vāḍestā
taragalle dāḍestā
eṁ sĕstāvo sūstā appuḍu
appuḍaṁṭe ĕppuḍu iṁkĕppuḍu