పల్లవి:
గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద
ముద్దు కావాలా..ఊ.. ముద్ద కావాలా..ఆ..
ముద్దు కావాలా..ఊ.. ముద్ద కావాలా..ఆ..
ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా
గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద...
చరణం 1:
రాగాలంత రాసలీలలు
అలు అరు ఇణి
రాగాలైన రాధ గోలలు
అలు అరు ఇణి
రాధా... రాధా బాధితుణ్ణిలే...
...ప్రేమారాధకుణ్ణిలే...
ఆహాహా
జారు పైట లాగనేలరా..అహ..అహ..
ఆరుబయట అల్లరేలరా..అహ..అహ..
ముద్దు బేరమాడకుండా ముద్దలింక మింగవా
||గోపెమ్మ చేతిలో గోరుముద్ద||
చరణం 2:
వెలిగించాలి నవ్వు మువ్వలు
అలా ..అలా... అహహ
తినిపించాలి మల్ల బువ్వలు
ఇలా.. ఇలా.. ఇలా
కాదా... చూపే లేత శోభనం
మాటే తీపి లాంఛనం...
ఆహాహా
వాలు జళ్ళ ఉచ్చులేసినా..అహ..ఆ
కౌగిలింత ఖైదువేసినా..అహ..ఆ..
ముద్దు మాత్రమిచ్చుకుంటె ముద్దాయల్లె ఉండనా
గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద
ముద్దు కావాలి..ఊ.. ముద్ద కావాలి..ఆ..
ముద్దు కావాలి..ఊ.. ముద్ద కావాలి..ఆ..
ఆ విందు ఈ విందు నా ముద్దు గోవిందా
గోపెమ్మ చేతిలో అహ..
రాధమ్మ చేతిలో అహ..హ....