గోపాలా.. నను పాలింప రావా
పల్లవి:
గోపాలా ..నను పాలింప రావా
గోపాలా ..నను పాలింప రావా
బృందావనిలో... వేచితి రా ..రా
బృందావనిలో... వేచితి రా ..రా!
గోపాలా ..నను పాలింప రావా
చరణం 1:
పొన్నల నీడ ..వెన్నెలవాడ ..నిన్నే వెదికే ..నీ రాధనురా
పొన్నల నీడ ..వెన్నెలవాడ ..నిన్నే వెదికే ..నీ రాధనురా
మురళీలోలా! మోహనబాలా! .. ఆ .. ఆ .. ఆ ..
మురళీలోలా! మోహనబాలా! జాలము నీకేల కేళీవిలోలా !
గోపాలా నను పాలింప రావా .. బృందావనిలో వేచితి రారా
గోపాలా నను పాలింప రావా....
చరణం 2:
పిల్లనగ్రోవి ..మెల్లగ వూది ..అల్లరిచేసే.. నల్లని సామీ
పిల్లనగ్రోవి ..మెల్లగ వూది ..అల్లరిచేసే.. నల్లని సామీ
వినపడుటేనా .. కనపడ రావా.. ఆ .. ఆ .. ఆ ..
వినపడుటేనా .. కనపడ రావా.. నీ రాగసుధలందు తేలించ రా రా!
గోపాలా నను పాలింప రావా .. బృందావనిలో వేచితి రారా
గోపాలా నను పాలింప రావా....
చరణం 3:
గలగలలాడే.. యమునానదిలో.. ఊయలలూగే ..పూలనావలో
కాలము మరచీ ..లోకము విడిచీ..
కాలము మరచీ ..లోకము విడిచీ ..నీ దివ్య చరణాల నివసించనీరా!
గోపాలా నను పాలింప రావా .. బృందావనిలో వేచితి రారా
గోపాలా నను పాలింప రావా ..ఆ ఆ ఆ!
pallavi:
gobālā ..nanu pāliṁpa rāvā
gobālā ..nanu pāliṁpa rāvā
bṛṁdāvanilo... vesidi rā ..rā
bṛṁdāvanilo... vesidi rā ..rā!
gobālā ..nanu pāliṁpa rāvā
saraṇaṁ 1:
pŏnnala nīḍa ..vĕnnĕlavāḍa ..ninne vĕdige ..nī rādhanurā
pŏnnala nīḍa ..vĕnnĕlavāḍa ..ninne vĕdige ..nī rādhanurā
muraḽīlolā! mohanabālā! .. ā .. ā .. ā ..
muraḽīlolā! mohanabālā! jālamu nīgela keḽīvilolā !
gobālā nanu pāliṁpa rāvā .. bṛṁdāvanilo vesidi rārā
gobālā nanu pāliṁpa rāvā....
saraṇaṁ 2:
pillanagrovi ..mĕllaga vūdi ..allarisese.. nallani sāmī
pillanagrovi ..mĕllaga vūdi ..allarisese.. nallani sāmī
vinabaḍuḍenā .. kanabaḍa rāvā.. ā .. ā .. ā ..
vinabaḍuḍenā .. kanabaḍa rāvā.. nī rāgasudhalaṁdu teliṁcha rā rā!
gobālā nanu pāliṁpa rāvā .. bṛṁdāvanilo vesidi rārā
gobālā nanu pāliṁpa rāvā....
saraṇaṁ 3:
galagalalāḍe.. yamunānadilo.. ūyalalūge ..pūlanāvalo
kālamu marasī ..logamu viḍisī..
kālamu marasī ..logamu viḍisī ..nī divya saraṇāla nivasiṁchanīrā!
gobālā nanu pāliṁpa rāvā .. bṛṁdāvanilo vesidi rārā
gobālā nanu pāliṁpa rāvā ..ā ā ā!