ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే
పల్లవి:
ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా
జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా ||ఘల్లుఘల్లు||
హరివిల్లు విప్పి కరిమబ్బువాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరనీ
జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేలా
రాళ్ళసీమలో ఈవేళ రతనాల ధారలే కురిసేలా
||జడివాన||ఘల్లుఘల్లు||
చరణం 1:
రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని
ఈ రత్నాక్షర లేఖనీ ఇపుడే పంపనీ
అన్నెం పున్నెం ఎరగని మాసీమకి రా రమ్మని
ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ
తొలగింది ముప్పు అని నీలిమబ్బు మనసారా నవ్వనీ
చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లనీ
ఆ సాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమై పాడేలా
శాంతిమంత్రమై గాలంతా దిశలన్ని అల్లనీ ఈవేళ
జడివాన జాడతో ఈవేళా జనజీవితాలు చిగురించేలా
రాళ్ళసీమలో ఈవేళా రతనాల ధారలే కురిసేలా
చరణం 2:
భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకర
ఆకసాన్ని ఇలదించరా కురిసే వానగా
మారని యాతన తీర్చగా మా తలరాతలు మార్చగా
ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంచరా
మహరాజు తానె సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా
భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా
జన క్షేమమె తన సంకల్పముగా తన ఊపిరె హోమ జ్వాలలుగా
స్వర్గాన్నే శాసించెనురా అమృతమును ఆహ్వానించెనురా ||జడివాన|| ఘల్లు ఘల్లు||
pallavi:
ghallu ghallumani sirimuvvalle sinuge seragā
jallu jallumani pulagiṁtallo puḍame pāḍagā ||ghallughallu||
harivillu vippi karimabbuvāna bāṇāle veyanī
niluvĕlla maṁchu vaḍagaḽḽu tāgi kaḍagalle tīranī
jaḍivāna jāḍado īveḽa janajīvidālu siguriṁchelā
rāḽḽasīmalo īveḽa radanāla dhārale kuriselā
||jaḍivāna||ghallughallu||
saraṇaṁ 1:
rāgāsulu iga lerani āgāśhānigi sĕppani
ī ratnākṣhara lekhanī ibuḍe paṁpanī
annĕṁ punnĕṁ ĕragani māsīmagi rā rammani
āhvānaṁ aṁdiṁchanī mĕrise sūbunī
tŏlagiṁdi muppu ani nīlimabbu manasārā navvanī
sirujallu muṁpu mana muṁgilaṁta mutyāle sallanī
ā sāsu gaṁdhamai nelaṁtā saṁkrāṁti gīdamai pāḍelā
śhāṁtimaṁtramai gālaṁtā diśhalanni allanī īveḽa
jaḍivāna jāḍado īveḽā janajīvidālu siguriṁchelā
rāḽḽasīmalo īveḽā radanāla dhārale kuriselā
saraṇaṁ 2:
bhuvibai iṁdruḍu pilisĕrā varuṇā varadai palagara
āgasānni iladiṁcharā kurise vānagā
mārani yādana tīrsagā mā talarādalu mārsagā
ī jalayajñamu sākṣhigā talane vaṁcharā
maharāju tānĕ samidhallĕ māri niluvĕllā vĕligĕrā
bhogānni viḍisi tyāgānni valasi tābasigā nilisĕrā
jana kṣhemamĕ tana saṁkalbamugā tana ūbirĕ homa jvālalugā
svargānne śhāsiṁchĕnurā amṛtamunu āhvāniṁchĕnurā ||jaḍivāna|| ghallu ghallu||