Ghallu ghallu ghallumamtu

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు
Year
Language

పల్లవి:

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు(2)
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు(2)
యెల్లలన్నవే యెరగని వేగంతో వెళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళూ
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళూ

చరణం 1:

లయకే నిలయమై నీ పాదం సాగాలి..ఆహహహహా..
మలయానిల గతిలో సుమబాలగా తూగాలి
వలలో వొదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడీ

తిరిగే కాలానికీ..ఆ..ఆ...
తిరిగే కాలానికి తీరొకటుందీ
అది నీ పాఠానికి దొరకను అందీ
నటరాజ స్వామి జటా జూటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సురగంగకు విలువేముందీ
విలువేముందీ

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళూ
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళూ

చరణం 2:

దూకే అలలకూ యే తాళం వేస్తారూ..ఆహాహా..
కమ్మని కలల పాట యే రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్థం

వద్దని ఆపలేరు...ఆ..ఆ..
వద్దని ఆపలేరు ఉరికే ఊహనీ
హద్దులు దాటరాదు ఆశల వాహినీ
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనమున పరిమళముల విలువేముందీ..
విలువేముందీ

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళూ
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళూ
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళూ
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళూ

pallavi:

ghallu ghallu ghallumaṁṭu mĕruballe tuḽḽu
jhallu jhallu jhalluna uppŏṁgu niṁgi vŏḽḽu
nalla mabbu sallanī sallani siru jallu(2)
pallaviṁchani nelagu pachchani paravaḽḽu

ghallu ghallu ghallumaṁṭu mĕruballe tuḽḽu
jhallu jhallu jhalluna uppŏṁgu niṁgi vŏḽḽu
vĕlluvŏchchi sāganī tŏlagari allarlu(2)
yĕllalannave yĕragani vegaṁto vĕḽḽu

ghallu ghallu ghallumaṁṭu mĕruballe tuḽḽū
jhallu jhallu jhalluna uppŏṁgu niṁgi vaḽḽū

saraṇaṁ 1:

layage nilayamai nī pādaṁ sāgāli..āhahahahā..
malayānila gadilo sumabālagā tūgāli
valalo vŏdugunā vihariṁche sirugāli
sĕlayeḍigi naḍanaṁ nerbiṁche guruveḍī

tirige kālānigī..ā..ā...
tirige kālānigi tīrŏgaḍuṁdī
adi nī pāṭhānigi dŏraganu aṁdī
naḍarāja svāmi jaḍā jūḍilogi seraguṁṭe
virusugubaḍu suragaṁgagu viluvemuṁdī
viluvemuṁdī

ghallu ghallu ghallumaṁṭu mĕruballe tuḽḽū
jhallu jhallu jhalluna uppŏṁgu niṁgi vŏḽḽū

saraṇaṁ 2:

dūge alalagū ye tāḽaṁ vestārū..āhāhā..
kammani kalala pāḍa ye rāgaṁ aṁṭāru
alalagu aṁdunā āśhiṁchina āgāśhaṁ
kalalā karagaḍamā jīvidāna paramārdhaṁ

vaddani ābaleru...ā..ā..
vaddani ābaleru urige ūhanī
haddulu dāḍarādu āśhala vāhinī
adubĕrugani āḍalāḍu vasaṁtālu valadaṁṭe
viri vanamuna parimaḽamula viluvemuṁdī..
viluvemuṁdī

ghallu ghallu ghallumaṁṭu mĕruballe tuḽḽū
jhallu jhallu jhalluna uppŏṁgu niṁgi vaḽḽū
nalla mabbu sallanī sallani siru jallu
vĕlluvŏchchi sāganī tŏlagari allarlu
pallaviṁchanī nelagu pachchani paravaḽḽu
ghallu ghallu ghallumaṁṭu mĕruballe tuḽḽū
jhallu jhallu jhalluna uppŏṁgu niṁgi vaḽḽū