ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన
పల్లవి:
ఘాటైన ప్రేమఘటన.. ధీటైన మేటి నటన.. అందంగా అమరిందిలే
ఇక ఆనందం మిగిలిందిలే .. నిజమెరుగవే పసిచిలుక
ఘాటైన ప్రేమఘటన.. ధీటైన మేటి నటన.. ఆనందం చిందించెలే...
నా అందం నీ వశమాయెలే .. తెరమరుగిక తొలగునులే
చరణం 1:
కోరుకున్నవాడే తగువేళ చూసి జతగూడే .. సుముహూర్తం ఎదురైనది
అందమైన ఈడే అందించమంటు దరిచేరే ..సందేశం ఎద విన్నది
లేనిపోని లోని శంక మానుకోవె బాలిక
ఏలుకోవా గోరువంక లేత నీలి కానుక
కులుకా రసగుళిక కళలొలుక తగు తరుణము దొరికెనుగా !
చరణం 2:
పూజలన్నీ పండి పురివిప్పి నేను జతులాడి అనురాగం శృతి చేయగా
మోజులన్నీ పిండే మగతోడు చేరువీనాడు సుఖభోగం మొదలౌనుగా
ఊసులన్నీ మాలగా పూసగుచ్చివేయనా
రాచకన్నెనేలగా దూసుకొచ్చి వాలనా
కరిగా తొలకరిగా రసఝరిగా అణువణువొక చినుకవగా !
pallavi:
ghāḍaina premaghaḍana.. dhīḍaina meḍi naḍana.. aṁdaṁgā amariṁdile
iga ānaṁdaṁ migiliṁdile .. nijamĕrugave pasisiluga
ghāḍaina premaghaḍana.. dhīḍaina meḍi naḍana.. ānaṁdaṁ siṁdiṁchĕle...
nā aṁdaṁ nī vaśhamāyĕle .. tĕramarugiga tŏlagunule
saraṇaṁ 1:
korugunnavāḍe taguveḽa sūsi jadagūḍe .. sumuhūrdaṁ ĕdurainadi
aṁdamaina īḍe aṁdiṁchamaṁṭu darisere ..saṁdeśhaṁ ĕda vinnadi
leniboni loni śhaṁka mānugovĕ bāliga
elugovā goruvaṁka leda nīli kānuga
kulugā rasaguḽiga kaḽalŏluga tagu taruṇamu dŏrigĕnugā !
saraṇaṁ 2:
pūjalannī paṁḍi purivippi nenu jadulāḍi anurāgaṁ śhṛti seyagā
mojulannī piṁḍe magadoḍu seruvīnāḍu sukhabhogaṁ mŏdalaunugā
ūsulannī mālagā pūsaguchchiveyanā
rāsagannĕnelagā dūsugŏchchi vālanā
karigā tŏlagarigā rasajharigā aṇuvaṇuvŏga sinugavagā !