Title (Indic)ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది WorkGangotri Year2003 LanguageTelugu Credits Role Artist Music M.M. Keeravani Performer Maalaviga Performer Es.pi. saran Writer Samdrabos LyricsTeluguపల్లవి: ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని... అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల.. వాగువంక.. చెట్టుచేమ.. గువ్వగూడు.. ఆశీర్వదించాలి ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది చరణం 1: ఎన్నో రంగుల పువ్వు.. ఎండ కన్నే ఎరగని పువ్వు సుందరమైన పువ్వు.. పలు సుగుణాలున్న పువ్వు ఏ గుడిలో అడుగుపెట్టునో... దేవుడు చల్లగ చూడాలి ఆ పువ్వుకు పూజలు చేయాలి దేవుడి గుండెల గుడిలో... ఆ పువ్వే.. హాయిగ ఉండాలి ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది చరణం 2: నీరును పోసి పెంచి.. పందిరల్లే నీడనిచ్చి ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి ఆ పువ్వుకి తోడు ఉండగా... దేవుడు వేరే లేడు కదా తోటమాలే పువ్వుకి దేవుడుగా మాలికి పువ్వుకు మధ్యన అనుబంధం... ఎన్నడూ వాడదుగా ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది Englishpallavi: ŏga toḍalo.. ŏga kŏmmalo.. ŏga puvvu pūsiṁdi maharāṇilā.. mahalakṣhmilā.. ā puvvu navviṁdi alāge navvudū uṁḍālani... alāge navvudū uṁḍālani niṁginela.. vāguvaṁka.. sĕṭṭusema.. guvvagūḍu.. āśhīrvadiṁchāli ŏga toḍalo.. ŏga kŏmmalo.. ŏga puvvu pūsiṁdi maharāṇilā.. mahalakṣhmilā.. ā puvvu navviṁdi saraṇaṁ 1: ĕnno raṁgula puvvu.. ĕṁḍa kanne ĕragani puvvu suṁdaramaina puvvu.. palu suguṇālunna puvvu e guḍilo aḍugubĕṭṭuno... devuḍu sallaga sūḍāli ā puvvugu pūjalu seyāli devuḍi guṁḍĕla guḍilo... ā puvve.. hāyiga uṁḍāli ŏga toḍalo.. ŏga kŏmmalo.. ŏga puvvu pūsiṁdi saraṇaṁ 2: nīrunu posi pĕṁchi.. paṁdiralle nīḍanichchi ĕṁḍā vānallonā ādariṁche toḍamāli ā puvvugi toḍu uṁḍagā... devuḍu vere leḍu kadā toḍamāle puvvugi devuḍugā māligi puvvugu madhyana anubaṁdhaṁ... ĕnnaḍū vāḍadugā ŏga toḍalo.. ŏga kŏmmalo.. ŏga puvvu pūsiṁdi maharāṇilā.. mahalakṣhmilā.. ā puvvu navviṁdi